టాలీవుడ్ లెజెండ్రీ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ బాబు లెక్క‌లు , ఈక్వేష‌న్లు ప‌క్కాగా ఉంటాయ‌న్న టాక్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఎప్ప‌టి నుంచో ఉంది. ఆయ‌న లో ఓ నిర్మాత ఉన్నాడు.. అంత‌కు మించి ఓ డిస్ట్రిబ్యూట‌ర్ ఉన్నాడు. ఈ రెండిటి కి మించి ఓ బిజినె స్ మేన్ కూడా ఉన్నాడు.. ఆయ‌న ఏం చేసినా లాభ న‌ష్టాలు లెక్క‌లు వేసుకునే చేస్తారు. సినిమా రంగంలో ఏ ప‌ని చేయాల‌న్నా న‌ష్టం వ‌స్తుంద‌ని అనుకుంటే ఆయ‌న ఆ ప‌ని చేసేందుకు ఎంత మాత్రం ఇష్ట‌ప‌డ‌ర‌న్న టాక్ ఉంది. అందుకే రామానాయుడు ఒక‌ప్పుడు భారీ బ‌డ్జెట్ సినిమాలు తీస్తే.. ఇప్పుడు సురేష్ బా బు మాత్రం భారీ బ‌డ్జెట్ సినిమా లు తీసి న‌ష్ట పోయేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేరు క‌థా బ‌లం ఉన్న సినిమాలు తీసుకుంటూ త‌క్కువ బ‌డ్జెట్ తో సినిమా చేసినా లాభాలు వ‌స్తేనే చాల‌ని అనుకుంటున్నారు.

అంతెందుకు ఆయ‌న సోద‌రుడు వెంక‌టేష్ తాజా చిత్రం నార‌ప్ప థియేట‌ర్ రిలీజ్ కు లేట్ అవుతుంద‌నే ఆయ‌న కు ఎన్ని థియేట‌ర్లు ఉన్నా కూడా ఓ టీటీకే ఇచ్చేశారు. అయితే ఇప్పుడు దృశ్యం 2 - విరాటపర్వం  సినిమాల విడుదల విష‌య‌లో ఆయ‌న ఏం తేల్చు కోలేక పోతున్నార‌ట‌. ఇప్పుడు థియేట‌ర్లు ఓపెన్ అయ్యాయి. జ‌నాల‌కు మ‌రీ కాక పోయినా ఓ మోస్త‌రుగా థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. ఈ రెండు సినిమా ల‌పై అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి.

అయితే ఇప్పుడు ఏపీలో టిక్కెట్ రేట్లు చాలా వ‌ర‌కు త‌గ్గించేశారు. ఈ టైంలో ఈ రెండు సినిమాలు థియేట‌ర్ల‌కు ఇస్తే లాభాలు వ‌స్తాయా ?  లేదా డిస్ట్రిబ్యూట‌ర్ షేర్ , ఖ‌ర్చులు పోగా నిర్మాత‌కు మిగిలేది ఏం ఉండ‌దా ?  లేక‌పోతే డైరెక్ట్ ఓ టీటీకి వెళ్లిపోవాలా ? అని సురేష్ బాబు డైల‌మాలో ఉన్నార‌ట‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి: