మెగా ప్రిన్స్ గా పేరు తెచ్చు కుంటున్న వ‌రుణ్ తేజ్ త్వ‌ర‌లో పెళ్లి పీఠ‌లు ఎక్క బోతున్నార‌న్న వార్త‌లు గ‌త కొద్ది రోజులుగా బాగా నే వినిపిస్తున్నాయి. అంతే కాకుండా వ‌రుణ్ తేజ్ కు కాబోయే అమ్మాయి ని కూడా మెగా ఫ్యామిలీ చూసేసింది అనే వార్త‌లు కూడా వచ్చాయి. అంతే కాకుండా ఈ వార్త‌ల పై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూడా ఒక సారి స్పందించాడు. త‌న కొడుకు వ‌రుణ్ తేజ్ కు త్వ‌ర‌లో నే వివాహాం చేస్తామ‌ని కూడా ప్ర‌క‌టించాడు. అయితే అమ్మాయి గురించి మాత్రం క్లారిటీ గా చెప్ప లేదు. అయితే గత రెండు ఏళ్ల క్రితమే మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న కూతురు నిహారిక కు వివాహాం చేసాడు. అలాగే త‌న కొడుకు వ‌రుణ్ తేజ్ కు కూడా పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు.



అయితే మెగా హీరో వ‌రుణ్ తేజ్ కాబోయే భార్య గురించి సోష‌ల్ మీడియా తో పాటు ఫీల్మ్ న‌గ‌ర్ లో కూడా ప‌లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా ఆమె గురించి మెగా బ్ర‌ద‌ర్ కూడా చెప్పిన‌ట్టు వార్తలు వ‌స్తున్నాయి. అయితే వ‌రుణ్ తేజ్ కు కాబోయే భార్య ఇప్ప‌టికే వ‌రుణ్ తేజ్ సినిమా లో కూడా న‌టించింద‌ట‌. అంతే కాకుండా నిహారికఅమ్మాయి మంచి స్నేహితులట‌. అంతే కాకుండా మెగా కుటుంబం లో ప్ర‌తి పండుగ కు కూడా అ అమ్మాయి వ‌స్తుంద‌ట‌. మెగా ఫ్యామిలీ కూడా ఆ అమ్మాయి తో చాలా స‌న్ని హితంగా ఉంటుంద‌ని తెలుస్తుంది. అయితే ఆ అమ్మాయి కి అందం తో మంచి గుణం కూడా ఉండ‌టం తో ఆ అమ్మాయి ని మెగా ఇంటి ని కోడ‌లిగా తీసుకు రావాల‌ని నాగ బాబు చుస్తున్నాడ‌ని స‌మాచారం. అయితే ఆ అమ్మాయి ఎవ‌రు అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది.





మరింత సమాచారం తెలుసుకోండి: