ఈ రోజు దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల‌ను అందించారు. దేశ వ్యాప్తంగా అన్ని భాషాల‌లో వ‌చ్చిన సినిమాల‌లో ప‌లు విభాగాల్లో ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేసిన ప‌లు సినిమా ల‌కు ఈ అవార్డు లను అంద‌చేసారు. ఈ అవార్డు ల‌ను మ‌న దేశ ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు అంద‌జేసాడు. అయితే జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డు ల‌ను మ‌న దేశం లోనే సినిమా రంగం లో ఉత్త‌మ అవార్డు గా ప‌రిగ‌ణిస్తారు. వీటిని ప్ర‌తి ఏడాది చివ‌ర్లో అంద‌జేస్తారు. అయితే ఈ ఏడాది మ‌న టాలీవుడ్ నుంచి కూడా ప‌లు విభాగాల్లో జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డు ల‌ను ప‌లు సినిమాలు అందుకున్నాయి. అందులో ముఖ్యం గా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరో గా స్టార్ డైరెక్ట‌ర్ వంశి పైడి ప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌హార్షి సినిమా రెండు విభాగాల్లో జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డు ల‌ను అందు కుంది.



అలాగే నేచుర‌ల్ స్టార్ నానీ హీరోగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం లో వ‌చ్చిన జెర్సీ సినిమా కూడా రెండు విభాగాల్లో జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డు ను అందుకుంది. అయితే నానీ జెర్సీ సినిమా ఏకంగా ఉత్త‌మ తెలుగు సినిమా గా అవార్డు ను అందుకుంది. ఇదే సినిమా ఉత్త‌మ ఎడిటింగ్ విభాగంలో న‌వీన్ నూలీ కి అవార్డు ద‌క్కింది. అలాగే మ‌హార్షి సినిమా కు కూడా రెండు విభాగాల్లో అవార్డు లు వ‌చ్చాయి. ఉత్త‌మ వినోదాత్మ‌క చిత్రం మ‌హార్షి సినిమా ఎంపిక అయింది. అలాగే ఉత్త‌మ కొరియో గ్రాఫ‌ర్ గా రాజు సుంద‌రం కు జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డు ద‌క్కింది. ఈ అవార్డు ల‌ను ఉప రాష్ట్ర ప‌తి వెంక‌య్య నాయుడు చేతుల మీదుగా అంద జేశారు. అయితే ఈ రెండు సినిమా లు కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను బ‌ద్ద‌లు చేసిన‌వే కావ‌డం విశేషం. అంతే కాకుండా ఈ రెండు సినిమా లు కూడా నానీ, మ‌హేష్ బాబు లకు ది బెస్ట్ సినిమా లు గా ఉన్నాయి.





మరింత సమాచారం తెలుసుకోండి: