టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే ప్రభాస్ తప్పకుండా గుర్తుకొస్తారు. తాజాగా బర్త్ డే జరుపుకున్న ప్రభాస్ 42 వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. బాహుబలి సినిమా సమయం నుండి ప్రభాస్ పెళ్లి గోల ఎక్కువయ్యింది. డార్లింగ్ పెళ్లి ఎప్పుడు అంటూ నెట్టింట్లో చర్చలు మొదలయ్యాయి. బాహుబలి సినిమా పూర్తవ్వగానే ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కనున్నారు అంటూ వార్తలు వెల్లువెత్తాయి. కానీ ఆ తర్వాత అలాంటిదేమీ జరగలేదు. పెదనాన్న కృష్ణంరాజు కూడా ప్రభాస్ పెళ్లి బాహుబలి తర్వాత అని ఓ సారి అనడంతో అభిమానులు చాలా ఆశ పెట్టుకున్నారు. కానీ అదీ జరగలేదు. సాహో సినిమా తరవాత ఇక ప్రభాస్ పెళ్లి ఖాయం అని కూడా అన్నారు కానీ అదీ కూడా నిజం కాలేదు.

ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీ అయిపోయారు ఈ ఆరడగుల అందగాడు. కొందరైతే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ని ప్రభాస్ ఆదర్శంగా తీసుకున్నారేమో అని కూడా అన్నారు. ఇక ప్రభాస్ పెళ్ళిపై సోషల్ మీడియాలో చాలా రూమర్లే ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ అనుష్కలు ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారు అని అప్పట్లో వార్తలు దుమారం రేగాయి. వీరు పేర్లు వినగానే అభిమానుల్లో తెలియని ఒక వైబ్రేషన్ "బిల్లా" మూవీతో తొలిసారిగా జత కట్టిన ఈ సెలబ్రిటీలు మొదటి చిత్రం తోనే సక్సెస్ ఫుల్ కాంబోగా పేరు తెచ్చుకున్నారు.

ఇక బాహుబలి సినిమాకి ఐదేళ్లు కలసి వర్క్ చేశారు. ఇక అప్పటి నుండి వీరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ వార్తలు చాలా రోజుల నుండి వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయంపై ప్రభాస్ మరియు అనుష్కలు పలు మార్లు స్పందిస్తూ తాము మంచి స్నేహితులమే తప్ప అంతకు మించి ఏమీ లేదని చెప్పుకొచ్చారు. కానీ వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. మరి వీరిలో ఒక ఫ్రెండ్ కల్పించుకుని వీరి మధ్య స్నేహాన్ని ప్రేమగా మార్చి పెళ్లి పీటల వరకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని భోగట్టా. అయితే ఆ ఫ్రెండ్ ఎవరు? ఈ ప్రయత్నం ఫలిస్తుందా? లాంటి పలు ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: