టాలీవుడ్ లో ఒకప్పుడు అనుష్క కి ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె కోసమే సినిమాలకి వెళ్లే అభిమానులు చాలామంది ఉండేవాళ్ళు అప్పట్లో. కానీ బాహుబలి 2 సినిమా తర్వాత అనుష్క మెల్లగా సినిమాలు చేయడం తగ్గించడం, మిగతా యంగ్ హీరోయిన్స్ గ్లామరస్ రోల్స్ తో దూసుకెళ్లడం అనుష్కకి పెద్ద మైనస్ గా మారింది.

ఆమె ఆ తర్వాత చేసిన సైజ్ జీరో , నిశ్శబ్దం లాంటి సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో అనుష్క కి ఛాన్సులు కూడా చాలా తగ్గాయి. అయితే 39 ఏళ్ల అనుష్క కి హీరోయిన్ గా కెరీర్ ఐపోయినప్పటికి కూడా ఆమె పెళ్లి గురించి ఇప్పటికి చాలా చర్చ నడుస్తూ ఉంటుంది. ఆమె కెరిర్ మొదట్లో అనుష్కకి గోపి చంద్ కి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది అని చాలా రూమర్స్ వచ్చాయి. కానీ అవి కొంత కాలం తర్వాత అవి తగ్గిపోయాయి. ఆ తర్వాత అనుష్క కి ప్రభాస్ కి మధ్య కూడా ప్రేమ నడిచింది అని అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఎవరు దాని గురించి మాట్లాడటమే మానేశారు. ఇలా అనుష్క మీద ఎన్ని రూమర్స్ వచ్చిన కూడా అవి ఏవి ఎక్కువ కాలం ఉండలేదు. అయితే అనుష్క కి పెళ్లి మీద పెద్దగా నమ్మకం లేకపోవడం వలన ఆమె పెళ్లి చేసుకోవడంపై ఎక్కువగా శ్రద్ధ చూపించట్లేదు అని టాక్. ఇక అనుష్క ప్రస్తుతం ఒక తెలుగు సినిమాలో నటిస్తూ బిజీగా వుంది. టాలీవుడ్ లో ప్రస్తుతం సెన్సేషన్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా రాబోతున్న ఆ సినిమాలో అనుష్క హీరోయిన్ గా కనిపించబోతుంది అని టాక్. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకాబోతుంది. ఒక యంగ్ అబ్బాయి వయసులో పెద్ద అయిన లేడీ తో ప్రేమలో పడే కాన్సెప్ట్ మీద ఈ సినిమా రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: