ప్రస్తుతం తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హీరో ఎవరంటే అఖిల్ అనే చెప్పాలి. ఈమధ్యనే ఆయన అదే పేరుతో కెరీర్ లోనే మొదటి సూపర్ హిట్ కొట్టాడు. అయితే 27 ఏళ్ల అఖిల్ ని చూస్తుంటే ఆయన ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా లేడు. 5 ఏళ్ల కెరీర్ లో ఇప్పుడే హిట్ కొట్టిన అఖిల్ కి పెళ్లి మీద ఎక్కువగా ఆశలు లేవు అని టాక్.

దానికి ఒక కారణం 2017 లో ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోయిన ఆయన పెళ్లి అయితే ఇంకొక కారణం ఈ మద్యనే నాగ చైతన్య సమంత డైవర్స్ . ఈ డైవర్స్ వల్ల అక్కినేని ఫామిలీ చాలా డిస్టర్బ్ అయ్యింది అని టాక్. దానితో అఖిల్ కూడా పెళ్లి గురించి ఇప్పట్లో ఆలోచించొద్దు అని అనుకుంటున్నాడట.ఇక అఖిల్ కెరీర్ విషయానికి వస్తే అసలు ఎక్సపెక్ట్ చేయకుండా సూపర్ హిట్ కొట్టాడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా తో. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయ్యి సూపర్ హిట్ వైపు దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న ఇంకొక చిత్రం సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఏజెంట్. ఈ సినిమాలో అఖిల్ లుక్ నిజంగానే అదిరిపోయింది అని చెప్పాలి.

 పక్క మాస్ ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్న ఏజెంట్ సినిమా మీద ఇప్పుడు భారీ అంచనాలు పెరిగాయి. అలాగే ఈ సినిమాలో అఖిల్ తో పాటుగా మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి నటించబోతున్నారు. వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో ఇంకా ఫిక్స్ కాలేదు. మెగాస్టార్ తో సైరా సినిమా తర్వాత సురేందర్ రెడ్డి చేస్తున్న  సినిమా అవ్వడంతో ఈ ఏజెంట్ మీద అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ  సినిమా పూర్తి అవ్వగానే సురేందర్ రెడ్డి పవర్ స్టార్ తో సినిమా చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: