పూరీ జగన్నాధ్. ఈ పేరు వినగానే ఆయన మూవీస్ అన్నీ గుర్తుకువస్తాయి. ఆయన సినిమా టైటిల్స్ కూడా చాలా వెరైటీగా ఉంటాయి. ఇక పూరీ డైలాగ్స్ కూడా ఒక ట్రెండ్ గానే చూడాలి. చాలా లైట్ గా క్యాజువల్ గా మాట్లాడుకున్న మాటలే ఆయన సినిమాల్లో పెడతారు. ఇక హీరో కంప్లీట్ గా అవుట్ అండ్ అవుట్ రఫ్ గా ఉంటాడు. దేని విషయంలో అయినా డోంట్ కేర్ అన్నట్లుగా డిజైన్ చేయడం పూరీ మార్క్ స్పెషల్.

ఇక పూరీ విషయంలో మరో మాట చెప్పుకోవాలి. ఆయన మంచి ట్రెండ్ సెట్టర్. అలాగే క్రియేటర్ కూడా. దాంతో పాటు అప్టూ డేట్ గా ఉంటారు. యూత్ లో మారుతున్న అభిరుచులు వారి ఆహార్యం, తీరు తెన్నులు అన్నీ కూడా పూరీ పూర్తిగా గమనిస్తారు. వాటినే తన హీరోకు కూడా అప్లై చేసి క్యారక్టర్ ని యూత్ ఓన్ చేసుకునేలా చేయడంలో మాస్టర్ డిగ్రీయే చేశాడు. ఇక పూరీ తన సినిమాలలో ఎక్కువగా విదేశాలను చూపిస్తాడు.

పూరీకి ఇష్టమైన ప్లేస్ బ్యాంకాక్ అని అందరికీ తెలిసిందే. అయితే ఇపుడు పూరీ రూట్ మార్చేశారు. ఆయన ఇపుడు ముంబై అంటున్నారు. ఎపుడైతే లైగర్ మూవీ స్టార్ట్ చేసారో తెలియదు కానీ నాటి నుంచి పూరీ ముంబై మీద మనసు పడ్డారు. లైగర్ షూటింగ్ మొదట్లో ముంబైలో కొంత తీశారు. ఆ తరువాత మాత్రం వేరే చోట్ల చేశారు. ఇపుడు మళ్లీ ఆయన ముంబైకి షిఫ్ట్ కావడం బట్టి చూస్తూంటే ఇక మీదట పూరీ ముంబైకే వెల్ కం, బ్యాంకాక్  కి టాటా చెప్పేశాడా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి లైగర్ పూరీ చాలా ప్రెస్టేజియస్ గా తీసుకున్నారని అంటున్నారు. సో పూరీ మార్క్ మ్యాజిక్ కోసం ఈ మూవీ రిలీజ్ ఇయర్ 2022 వరకూ వెయిట్ చేయాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: