ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండింగ్ హీరోలుగా దూసుకుపోతున్న దేవరకొండ బ్రదర్స్ కలిసి ఇంటర్వ్యూ ఇస్తే ఎలా ఉంటుంది అంటూ అభిమానులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక త్వరలో ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాను స్వయంగా తన రౌడీ అన్న విజయ్ దేవరకొండ నిర్మించాడు. దాంతో సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా రౌడీనే చూసుకుంటున్నాడు.ఇక త్వరలో విడుదల కాబోతున్న ఈ పుష్పక విమానం సినిమా కోసం తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి విజయ్ దేవరకొండ గెట్టింగ్ టు నో ది దేవరకొండాస్ అంటూ చిట్ చాట్ జరిపడం జరిగింది.ఇక విజయ్ దేవరకొండ ఇంకా అలాగే ఆనంద్ దేవరకొండ ప్రైమరీ ఎడ్యుకేషన్ టైమ్ నుంచే హాస్టల్ లో ఉండేవారట.అలాగే చదువుల్లో ఆనంద్ బెస్ట్ ప్రతి సబ్జెక్ట్ లో 100 కు 100 మార్కులు వచ్చేవట. విజయ్ కు మాత్రం 85 వరకు మార్కులు వచ్చేవట.ఇక హాస్టల్ లో ఆనంద్ సైలెంట్ కిడ్ అయితే విజయ్ అయితే గ్యాంగ్ లతో కలిసి గొడవలు పడే టైప్ అట.

ఇక తమ్ముడిని మాత్రం ఎవరైనా ఏదైనా అంటే వెంటనే వెళ్లి ఫైటింగ్ చేసేవాడట రౌడీ. ఇక దీంతో విజయ్ దేవరకొండ అంటే హాస్టల్ హెడ్ మాస్టర్ బాగా భయపడేవారట.ఇక ఇంట్లో కూడా ఆనంద్ దేవరకొండను చాలా ఎక్కువగా ముద్దు చేసేవారట. ఇక విజయ్ ఆట బొమ్మలు అన్నీ కూడా ఆనంద్ కే దక్కేవట. క్రికెట్ లో ఆనంద్ ఔట్ అయినా సరే మళ్లీ అతనికి బ్యాటింగ్ ఛాన్స్ ఇచ్చేవారట.ఇక ఇలా తమ్ముడికే ఇంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంటే దాన్ని చూసి విజయ్ కు మండిపోయేదట. ఇక కొన్నాళ్లకు ఆనంద్ కు క్రికెట్ మీద ఇష్టం పెరిగి 100 మార్కులు కాస్త తగ్గుతూ వచ్చాయట.  ఇక విజయ్ దేవరకొండ వాళ్లకు ఒక ఇనిస్టిట్యూట్ కూడా ఉండేది.దానిలో స్పోకెన్ ఇంగ్లీష్ మోటివేషనల్ క్లాసులు చెప్పేవారు.ఇక ఎవరైనా ఫ్యాకల్టీ రానప్పుడు విజయ్ ఆ విద్యార్థులకు పాఠాలు చెప్పేవాడట. అలా చెప్పినందుకు విజయ్ కు మంచి అమౌంట్ జేబులో పడేదట.అలా మధ్య తరగతి నుంచి వచ్చిన వీరు ఇప్పుడు కెరీర్ పరంగా రాణిస్తుండటంతో వారి తల్లి దండ్రులు చాలా హ్యాపీగా ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: