యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్.ఇక డార్లింగ్ సినిమాకు సంబంధించి ఏదైనా అప్ డేట్ వస్తే.. అది ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలోనూ అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్. ఇక ఈ మధ్య కాలంలో విడుదలైన బడా సినిమాల టీజర్లు చూసుకుంటే.. 'ఆర్ ఆర్ ఆర్', 'పుష్ప', 'సర్కారు వారి పాట' టీజర్లు సౌత్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా 'రాధేశ్యామ్' సినిమా టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్ ప్రస్తుతం సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. టీజర్ విడుదలయిన 24 గంటల్లోనే 52 మిలియన్ల వ్యూస్ ని అందుకుంది. కేవలం ఓ చిన్న టీజర్ తో ఐదు కోట్లకు పైగా వ్యూస్ సాధించడం అనేది సాధారణ విషయం కాదు. కానీ ప్రభాస్ మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. టాలీవుడ్లో ఈ స్థాయిలో వ్యూస్ సాధించిన ఏకైక హీరోగా ప్రభాస్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడమే కాకుండా.. గత రికార్డులను కూడా చేరిపేచేసాడు. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే.. కన్నడ హీరో యశ్ 'కె జి ఎఫ్ 2' టీజర్ తొలి స్థానంలో నిలువగా..

ఆ తర్వాత రెండవ స్థానాన్ని ప్రభాస్ 'రాధేశ్యామ్'టీజర్ సొంతం చేసుకుంది. 'కే జి ఎఫ్ 2' టీజర్ 24 గంటల్లో 68 మిలియన్లకు పైగా న్యూస్ సాధించింది. ఇక ఆ తర్వాత ప్రభాస్ 'రాధేశ్యామ్' టీజర్ తెలుగులో నెంబర్ వన్, అలాగే ఆల్ ఇండియా నంబర్ 2 స్థానాలను కైవసం చేసుకోవడంతో అటు చిత్ర యూనిట్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ప్రభాస్ కు ఏ స్థాయిలో ఫ్యాన్  ఫాలోయింగ్ ఉందో మరోసారి 'రాధేశ్యామ్' టీజర్ నిరూపించిందని చెప్పవచ్చు. ఇక 'రాధేశ్యామ్' సినిమాతో ప్రభాస్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటాడని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: