రాధేశ్యామ్..ఈ సినిమా టైటిల్ తగ్గట్టుగా ప్రభాస్ ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రేమకు చిహ్నంగా ఈ టైటిల్లో పెట్టినట్లు సమాచారం. ఇక ఈ సినిమా ట్రైలర్ ను చూసినప్పుడు కూడా ప్రేక్షకులకు ఇదొక ప్రేమకథ అనే విషయం బాగా అర్థమైంది. ఇక ఈ లవ్ స్టోరీ ఇటలీ నేపథ్యంలో సాగే కథ కావడంతో మరింత ఆసక్తి రేపుతోంది ఈ సినిమా.


ఇక అంతే కాకుండా పునర్జన్మల లుక్ ఉందన్నట్లుగా కూడా సమాచారం. ఈ కథకు అద్భుతమైన గ్రాఫిక్స్ తోడవడంతో ఈ సినిమా పై అభిమానులు, నెటిజన్స్ చాలా ఆతృతగా ఉన్నారు. ఇక ఈ సినిమా కథను ఇతర భాషలలో సైతం విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే కూడా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల కానుంది.

తాజాగా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ విడుదల చేయగా.. ఎక్కువగా ప్రభాస్ పాత్ర పైనే ఫోకస్ చేస్తూ ఆ టీజర్ నీ విడుదల చేయడం జరిగింది. దాంతో పూజా హెగ్డే అభిమానులు కొంత నిరాశ గా ఉన్నట్లుగా సమాచారం. ఇక మేకర్స్ ఈ సినిమాకు చాలా ఖర్చు చేస్తున్నట్లుగా ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది.ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ కూడా రాబోతోంది అన్నట్లుగా సమాచారం.

అదేమిటంటే మరో టీజర్ ను కూడా విడుదల చేసేందుకు     చిత్ర యూనిట్ సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ టీజర్ విడుదల చేయాలని ముందుగానే అనుకున్నట్లుగా సమాచారం. లేదంటే ఈ టీజర్ కొంతమందికి అర్థం కాక పోవడంతో మరొక టీజర్లు వదులుతున్నారు అన్నట్టుగా కూడా సమాచారం. ఇక ఈ సినిమాలో పాటలు చాలా హైలెట్ గా నిలవనున్నాయి . ఈ సినిమా నుంచి ఒక్కో పాటను విడుదల చేయబోతున్నారు త్వరలో అన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: