కన్నడ పవర్ స్టార్ గా గుర్తింపు పొందిన రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పునీత్ రాజ్ కుమార్ తన ఐదు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే స్క్రీన్ పంచుకోవడం జరిగింది.. ఇకపోతే తాను నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకొని, కలెక్షన్ల సునామీని కూడా సృష్టించాయి.. ఇకపోతే శాండిల్వుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోలలో రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పునీత్ రాజ్ కుమార్ కూడా ఒకరు.. ఇక ఈయన నటించిన యువరత్న సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..


సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించడమే కాకుండా పునీత్ రాజ్ స్టార్ స్టేటస్ ను కూడా మరింత పెంచేసింది.. ఇకపోతే ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా ఓటీటీ రేట్లు చూస్తే కన్నడ సినీ ఇండస్ట్రీలోని అదొక రికార్డ్ అని చెప్పవచ్చు.. అంతేకాదు ఈ సినిమాలో మన తెలుగు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో ఒక పాట పాడి విశేష ఆదరణను కూడా తెచ్చి పెట్టాడు.. ఈ సందర్భంగా అప్పట్లో పునీత్ చెప్పిన విషయం ఏమిటంటే.. ఇంటర్వ్యూలో.. మీకు , జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న బంధం ఏమిటి ..? మీ ఇద్దరి మధ్య స్నేహబంధమా లేక పాపులారిటీ కోసం ఈ సినిమాలో ఆయన చేత పాట పాడించారా..? అనే విషయంపై ఆరా తీయగా ఆయన కొన్ని షాకింగ్ నిజాలు తెలిపాడు..

జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు ఆయన కుటుంబం కూడా మా కుటుంబానికి చాలా క్లోజ్.. మేమంతా అన్నదమ్ముల లాగే ఉంటాను..అంతే కాదు జూనియర్ ఎన్టీఆర్ తల్లి కూడా కర్ణాటక ..అందుకే నేను ఎప్పుడూ ఎన్టీఆర్ ను ఆఫ్ బ్రదర్ అని పిలుస్తూ ఉంటాను.. మొదట ఎస్.ఎస్.తమన్ ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాడించాలని అనుకొని వెళ్లి కలిశాడు.. లిరిక్స్ కూడా వినిపించడం జరిగింది.. ఇక తనకు నచ్చే ఎన్టీఆర్ వచ్చి యువరత్న సినిమా లో పాట పాడడమే కాదు మంచి ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాడు. ఇక ఎన్టీఆర్ మాత్రమే కాదు రామ్ చరణ్ , మహేష్ బాబు  కూడా నాతో చాలా సన్నిహితంగా ఉంటారు.. అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర కూడా నేను ఆశీస్సులు పొందాను. అన్ని సినిమా ఇండస్ట్రీల నటులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు అని తెలిపాడు పునీత్ . ఇకపోతే ఈయన ఈ రోజు ఉదయం  గుండె పోటు తో మరణం చెందడం తో ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: