టాలీవుడ్ తో పాటు అన్ని ఇండ‌స్ట్రీల‌లో హీరోయిన్ ల‌కు త‌మ అందం పై ప్ర‌త్యేక దృష్టి పెడుతారు. తాము అందం గా ఉండ‌టానికి అనేక ప్ర‌యోగాలు చేస్తారు. అంతే కాకుండా ఆప‌రేష‌న్ లు కూడా చేసు కోవ‌డానికి వెన‌కాడ‌రు. అయితే ఇలాంటి ఆపరేష‌న్ లు చేసుకున్నప్పుడు అందులో కొన్ని విక‌టిస్తాయి. దీంతో వారు చ‌నిపోతారు. ఇలాంటి ఘ‌ట‌న నే హీరోయిన్ ఆర్తి అగ‌ర్వాల్ విష‌యంలో జరిగింది. అప్ప‌ట్లో ఆర్తి అగ‌ర్వాల్ వరుస సినిమా ల‌తో చాలా బిజీ గా ఉండేది. టాలీవుడ్ అగ్ర హీరోల‌తో వ‌రుస గా సినిమా లు తీసేది. అయితే టాలీవుడ్ కు నువ్వు నాకు వ‌చ్చావ్ అనే సినిమా తో ప‌రిచ‌యం అయింది. ఈ సినిమా త‌ర్వాత ఆర్తి అగ‌ర్వాల్ అవ‌కాశాలు వ‌రుస‌గా వ‌చ్చాయి. ఆర్తి అగ‌ర్వాల్ న‌టించిన కొన్ని సినిమా లు ప్లాప్ లు అయినా ద‌ర్శ‌కులు, నిర్మాతలు, స్టార్ హీరోలు ఆర్తి అగ‌ర్వాల్ వైపే చూసేవారు.



అయితే హీరోయిన్ గా ఆర్తి అగ‌ర్వాల్ కేరీయ‌ర్ పీక్స్ ఉన్న స‌మ‌యంలో కాస్తా లావు అయింది. దీంతో ఆర్తి అగ‌ర్వాల్ కు అవ‌కాశాలు కాస్త త‌గ్గాయి. దీంతో త‌న లో ఉన్న అన‌వస‌ర కొవ్వు ను తొల‌గించ‌డానికి అనేక ప్ర‌య‌త్నాలు చేసింది ఆర్తి అగ‌ర్వాల్. చాలా రోజుల పాటు వ్యాయ‌మం, యోగ వంటివి కూడా చేసింది. అయితే ఇవి ఎక్కువ ఫ‌లితం చూప‌క పోవ‌డం తో లైపో స‌క్ష‌న్ అనే ఆప‌రేష‌న్ చేసుకుంది. అయితే ఈ ఆపరేష‌న్ చేసుకున్న త‌ర్వాత ఆర్తి అగ‌ర్వాల్ కొన్ని రోజుల బాగానే ఉంది. కానీ త‌ర్వాత గుండె పోటు వ‌చ్చి ఆక‌స్మాతుగా మ‌ర‌ణించింది. అయితే ఆర్తి అగ‌ర్వాల్ లావు త‌గ్గ‌డానికి చేసుకున్న లైపో స‌ర్జ‌రీ యే ఆర్తి అగ‌ర్వాల్ ప్రాణం పోవ‌డానికి కార‌ణ‌మ‌ని ప‌లువురు డాక్ట‌ర్లు చెప్పారు. అయితే ఆర్తి అగ‌ర్వాల్ తెలుగు లో న‌టించిన ఇంద్ర‌, వ‌సంతం, నువ్వు లేక నేను లేను, వీడే, అడ‌వి రాముడు వంటి సినిమా లు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి. ఎది ఏమైనా హీరోయిన్ గా కేరీయ‌ర్ పిక్స్ లో ఉన్న స‌మ‌యంలో ఆర్తి అగ‌ర్వాల్ చ‌నిపోవ‌డం టాలీవుడ్ మొత్తాన్ని విషాదం లో ముంచేత్తింది.




మరింత సమాచారం తెలుసుకోండి: