‘ఆర్ ఆర్ ఆర్’ జనవరి 7న విడుదలకు రెడీ అవుతున్న పరిస్థితులలో ఈమూవీ ప్రమోషన్ కు సంబంధించిన కౌన్ డౌన్ మొదలైంది. ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదట సింగపూర్ లో జరిగిన తరువాత ఆపై ముంబాయ్ లో ఆతరువాత హైదరాబాద్ లో నిర్వహించే విధంగా భారీ పబ్లిసిటీ ప్లాన్ ను ఇప్పటికే రాజమౌళి డిజైన్ చేసినట్లు టాక్.


ఈమధ్యనే పివిఆర్ సినిమా ధియేటర్లలో ఈసినిమాకు సంబంధించిన భారీ పోష్టర్ ను లాంచ్ చేసిన తరువాత రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ నేటితరం ప్రేక్షకుల అభిరుచి పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ప్రస్తుతతరం ప్రేక్షకులు భాష ప్రాంతం అదేవిధంగా నటీనటులు అన్న విషయానికి మించి ఆలోచిస్తూ కథలో అదేవిధంగా మూవీ టేకింగ్ లో ఏమాత్రం వెరైటీ చూపించినా భాషాభిమానం పక్కకు పెట్టి ప్రేక్షకులు సినిమాలను చూస్తున్నారని కామెంట్స్ చేసాడు.


ఇలాంటి పరిస్థితులలో సినిమాలు తీయడం అంత సులువైన పని కాదని అంటూ ప్రేక్షకులకు ఎన్నో వినోద మార్గాలు అందుబాటులో ఉండటంతో ఇప్పుడు ధియేటర్లకు ప్రేక్షకులను రప్పించడానికి చాల జాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థితి అంటూ అభిప్రాయ పడ్డాడు. ఇది ఇలా ఉండగా ఒకప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అయిన నవంబర్ 1న ‘ఆర్ ఆర్ ఆర్’ ఫస్ట్ గ్లిమ్స్ విడుదల అవుతున్నట్లు గా ప్రకటన రావడంతో నవంబర్ 4న వచ్చే దీపావళి ఇంకా ముందుగానే వస్తున్నట్లు చరణ్ జూనియర్ అభిమానులు భావిస్తున్నారు.


ఈ ఫస్ట్ గ్లిమ్స్ నవంబర్ 1న ఉదయం 11 గంటలకు విడుదల కాబోతోంది. సుమారు 45 సేకన్స్ భారీ గ్రాఫిక్స్ వర్క్స్ తో నిండి ఉండే ఈ ఫస్ట్ గ్లిమ్స్ తో ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియా ప్రారంభం కాబోతోంది. 100 కోట్ల కలక్షన్స్ ఫిగర్స్ ను చూసి టాలీవుడ్ ఇండస్ట్రీ రెండు సంవత్సరాలు గడిచిపోయిన పరిస్థితులలో సంక్రాంతి ముందే విడుదలకాబోతున్న ఈమూవీ ఎన్ని వందల కోట్లను తెచ్చి పెడుతుందో చూడాలి..




మరింత సమాచారం తెలుసుకోండి: