మంచు మ‌నోజ్ హీరో గా అజ‌య్ ఆండ్రూస్ నూత‌క్కి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ సినిమా ఒక్క‌డు మిగిలాడు. ఈ సినిమా ను చిత్ర బృందం 2017 న‌వంబ‌ర్ నెల‌లో విడుద‌ల చేశారు. కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం చాలా సంవ‌త్స‌రాల క్రిత‌మే పూర్తి చేసుకుంది. ఈ సినిమా విడుద‌ల చేస్తే అనేక రకాలు గా అడ్డంకులు వ‌స్తాయ‌ని ముందే ఉహించి ఈ సినిమా విడుద‌ల ను చిత్ర యూనిట్ వాయిదా వేసింది. ఎట్ట‌కేల‌కు ఒక్క‌డు మిగిలాడు సినిమా ను 2017 లో విడుద‌ల చేశారు. అయితే ఈ సినిమా విడుద‌ల అయిన సంద‌ర్భం లో నూ కొంత వ‌ర‌కు వివాదాలు జ‌రిగియి. ముఖ్యం గా ఈ సినిమా ను త‌మిళులు చాలా వ‌ర‌కు వ్య‌తిరేకించారు. ఈ ఒక్క‌డు మిగిలాడు సినిమా లో త‌మ‌ను కించ ప‌రుస్తూ చూపించార‌ని వారి వాద‌న‌.



వాస్త‌వానికి ఈ ఒక్క‌డు మిగిలాడు సినిమా ను శ్రీ లంక‌లో ఉన్న త‌మిళు ల కు స్వ‌తంత్రం తీసుకు రావాల‌ని పోరాటం చేసిన ఎల్ టీటీఈ ఉద్యమ సంస్థ నేత ప్ర‌భాక‌ర‌న్ జీవితం ఆధారంగా తెర‌కెక్కించాని తెలుస్తుంది. అయితే ఈ సినిమా లో ప్ర‌భాక‌ర‌న్ పేరు గానీ, ఎల్ టీటీఈ పేరు గాని ఎక్క‌డా కూడా ప్ర‌స్త‌వించ లేదు. అయితే ఈ సినిమా లో త‌మిళుల‌ను తివ్ర‌వాదుల్ల చిత్రికరించార‌ని ప‌లువురు త‌మిళులు ఆందోళ‌న లు చేశారు. ఈ సినిమా విడుద‌ల కాకుండా అడ్డు కోవాల‌ని ప్ర‌య‌త్నం కూడా చేశారు. ఇలాంటి వివాదాలు ఎదురు అవుతాయ‌నే ఈ సినిమా ను విడుదల చేయ‌కుండా చాలా రోజుల పాటు వాయిదా వేశారు. అయినా ఈ సినిమా విడుద‌ల అయినా ఎక్కువ రోజులు థీయేట‌ర్ ల‌లో ఆడ‌లేదు. అయితే ఎల్ టీటీఈ నేత ప్ర‌భాక‌ర‌న్ ను కొంత మంది త‌మిళులు గొప్ప వ్య‌క్తి గా కీర్తిస్తారు.




మరింత సమాచారం తెలుసుకోండి: