పెళ్లి చూపులు సినిమా హిట్ అయిన త‌ర్వాత విజ‌య్ దేవ‌ర కొండ స్టార్ డ‌మ్ తెచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమా ను సందీప్ రెడ్డి వంగ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమా హిట్ అయిన త‌ర్వాత హీరో విజ‌య్ దేవర కొండ కు డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగ కు హీరోయిన్ షాలిని పాండె కు క‌మిడియ‌న్ రాహుల్ రామ‌కృష్ణ కు వరుస సినిమా ల‌లో అవ‌కాశాలు వ‌చ్చాయి. అంతలా అర్జున్ రెడ్డి సినిమా హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా కొట్ట‌డానికి ప్ర‌ధాన కార‌ణం విజ‌య్ దేవ‌ర కొండ న‌ట‌న, సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం, అద్భుత మైన ల‌వ్ స్టోరీ తో పాటు ఈ సినిమా పై వ‌చ్చిన వివాదాలు అని కూడా చెప్పవ‌చ్చు. అర్జున్ రెడ్డి సినిమా పై వ‌చ్చిన వివాదాలే ఈ సినిమా ప్ల‌స్ గా మారాయి.



సినిమా మొద‌ట వివాదం పోస్ట‌ర్ల  నుంచి ప్రారంభం అయింది. పొస్ట‌ర్ల‌లో అశ్లీల‌త ఉంద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి. హ‌న్మంత‌రావు పోస్ట‌ర్ల ను చించి వేస్తాడు. దీనిపై హీరో విజ‌య్ దేవర కొండ 'చిల్ తాత' అనే కామెంటు చేస్తాడు. దీంతో వివాదం చిలికి చిలికి గాలి వానల మారుతుంది. ఈ సినిమా లో అస‌భ్య క‌ర‌మైన స‌న్నివేసాలు  ఉంటాయ‌ని ఈ సినిమా విడుద‌ల ను అడ్డు కోవాల‌ని కూడా చాలా మంది ఆందోళ‌న‌లు చేశారు. ఈ సినిమా విడుద‌ల అయిన త‌ర్వాత వివాదాల తీవ్ర‌త ఎక్కువ అయింది. అశ్లీల‌త‌, డ్ర‌గ్స్ వ‌ల్ల యువ‌త త‌ప్పు దారి ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని ప‌లు మ‌హిళా సంఘాలు ఆందోళ‌న‌లు చేప‌ట్టాయి. అయితే ఈ ఆందోళ‌నల వ‌ల్లే అర్జున్ రెడ్డి సినిమా ఫ్రీ ప‌బ్లిసిటీ అయింది. దీంతో ఈ సి నిమా చాలా రోజులు ఆడింది. అలాగే ఎక్కువ వ‌సూళ్లు కూడా రాబ‌ట్టింది.





మరింత సమాచారం తెలుసుకోండి: