పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్ జె సూర్య దర్సకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా ఖుషి 2001లో విడుదలై ఎంతో పెద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత హీరోగా ఎంతో గొప్ప క్రేజ్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడి నుండి మరింత భారీ అవకాశాలు అందుకుని కెరీర్ పరంగా ఎంతో దూసుకెళ్లారు. ఇక కొన్నేళ్ల విరామం తరువాత మరొక్కసారి పవన్ కళ్యాణ్ తో సూర్య తీసిన సినిమా కొమరం పులి.

నికిషా పటేల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించగా దీనిని సింగనమల రమేష్ బాబు నిర్మించారు. అయితే అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయింది. పవన్ కళ్యాణ్ ఇందులో కొమరం పులి ఐపీఎస్ అనే పాట చేయగా ఆయన తల్లిగా తమిళ సీనియర్ నటి శరణ్య యాక్ట్ చేసారు. యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే అప్పట్లో ఈ సినిమా కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకుంది.

సినిమా టైటిల్ నుండి కొమరం అనే పదాన్ని తొలగించాలి అంటూ తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీం వర్గీయలు మరియు ఆయన కుటుంబ సభ్యులు ఒకింత వ్యతిరేకత వ్యక్తం చేసారు. నిజానికి తమకు సినిమాపై ఎటువంటి వ్యతిరేకత లేదని, అయితే ఒక పక్క కమర్షియల్ సినిమాకి అంతటి గొప్ప వీరుడి పేరు పెట్టడం సరైందని కాదని తాము భావించాం అని, అందుకే సినిమా టైటిల్ నుండి కొమరం తొలగించాలి అంటూ వారు విజ్ఞప్తి చేయడంతో ఆ తరువాత చిత్ర బృందం దానికి అంగీకరించి మూవీ టైటిల్ ని ఫైనల్ గా పులి గా నిర్ణయించింది. ఆ విధంగా కొద్దిపాటి వివాదాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొమరం పులి నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: