సాధార‌ణంగా సినిమా రంగం లోకి క‌నీసం ఐదు నుంచి ప‌ది సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న వారు న‌టిస్తారు. అది కూడా సినిమా లో దాదాపు ప‌ది నుంచి ప‌దిహేను నిముషాలు మాత్ర‌మే క‌న‌ప‌డే చిన్న పాత్ర‌లో కనిపిస్తారు. కాని ఒక హీరో ఏడాది వ‌య‌స్సు లోనే ఒక సినిమా రంగం లో కి అడుగు పెట్టాడు. అంతే కాకుండా ఫుల్ లేన్తు రోల్ ను పోషించాడు. అంతే కాకుండ ఈ సినిమా లో ఆయ‌న న‌టించినందుకు ఏకంగా ఒక ఫిలిం ఫేర్ అవార్డు ను కూడా సొంతం చేసుకున్నారు. ఆ న‌టుడే అక్కినేని నాగ‌ర్జున అమ‌ల కుమారుడు అక్కినేని అఖిల్. ఆయ‌న న‌టించిన సినిమా సిసింద్రి. ఈ సిసింద్రి సినిమా 1995 లోనే వ‌చ్చింది. ఈ సినిమా లో అక్కినేని నాగ‌ర్జున హీరో గా న‌టించాడు.



ఆల అక్కినేని నాగ‌ర్జున న‌టించిన ఆ సినిమా లో అఖిల్ సిని మా మొత్తం క‌నిపిస్తాడు. అంతే కాకుండా ఆ పాత్ర తో నే సినిమా మ‌లుపు లు తిరుగుతుంది. అలాగే ఈ సినిమా ప్ర‌ధాన ఆధారం కూడా ఆ పాత్ర నే. అందు వ‌ల్లే నాగ‌ర్జున ఆ పాత్ర‌లో త‌న కొడుకు ను న‌టింప జేశాడు. దీంతో ఏడాది వ‌య‌స్సు లోనే అక్కినేని అఖిల్ కు ఉత్త‌మ బాల నటుడి గా ఫిల్మ్ ఫేర్ అవార్డు వ‌చ్చింది. అయితే ప్ర‌స్తుతం అక్కినేని అఖిల్ హీరో గా చాలా సినిమా లు తీస్తున్నాడు. మొద‌ట త‌న సినిమా లు అన్ని ఫ్లాప్ అయినా ప్ర‌స్తుతం అఖిల్ కు కొంత వ‌ర‌కు ఫ్యాన్ భేస్ వ‌చ్చిన‌ట్టే ఉంది. తాజాగా ఆయ‌న న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమా పెద్ద హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. గ‌తంలో ఆయ‌న న‌టించిన హాలో అనే సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కు అర‌గేట్రం చేసిన ఉత్త‌మ హీరో అనే ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నాడు.  




మరింత సమాచారం తెలుసుకోండి: