మాస్ మహారాజా రవితేజ డైరెక్టర్ గోపి చంద్ మలినేని 'క్రాక్' చిత్రంతో అపజయాల పరంపరకి అడ్డుకట్ట వేయడమే కాదు కొన్ని ఆసక్తి కరమైన చిత్రాలను ముందుకుతీసుకుతెచ్చేందుకు తను ప్రధాన పాత్రధారిగా ఒప్పందాల పైన సంతకాలు చేశారు. ఈ క్రమంలోనే 'ఖిలాడీ', 'రామారావు ఆన్ డ్యూటీ', 'ధమాకా' చిత్రాల చిత్రీకరణలో బిజీ గా వున్నాడు రవితేజ.  'బాహుబలి' మరియు 'కే జి ఎఫ్' విజయాలతో సౌత్ హీరోలు పాన్ ఇండియా చిత్రాలను ఒకరి తరువాత ఒకరు ప్రకటిస్తూ బాలీవుడ్ చిత్ర ప్రముఖులను ముక్కున వేలు వేసుకునేవిధంగా అద్భుతమైన  కథలతో చిత్రాలను ప్రకటిస్తున్నారు.  ఇప్పుడు పాన్ ఇండియా కథానాయకుల జాబితాలో మన మాస్ మహారాజా రవితేజ కూడా చేరారు. ఈ మధ్య కాలంలో రవితేజ చిత్రాల అప్డేట్స్ వెల్లువ అభిమానులని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

 
రెం డు రో జుల  వ్య వధి లో రవి తేజ చిత్రా ల సం బంధించి రెం డు ఆస క్తి కర మైన ప్రకట నలు వెలువ డ్డాయి. 'ఆర్ టి 7 0' చి త్రం ఒక వి భిన్నమై న మరియు ఆసక్తి కర మైన కథాంశం తో సుధీర్ వర్మ దర్శకత్వంలో  అతి త్వరలో ప్రారంభం కానుంది. దీని గురించి మరిన్ని విషయాలు 5వ తేదీన వెలువడనున్నాయి.  ఇకపోతే, కొద్ది నిముషాల క్రితం రవితేజ 'ఆర్ టి 71' ఒక పాన్ ఇండియా చిత్రమని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం గురించి మరిన్ని ఆసక్తి కరమైన విషయాలు రేపు 12 గంటల 6 నిముషాలకు వెలువడనున్నాయి.
ఫిలిం నగర్ సమాచారం ప్రకారం 'ఆర్ టి 71' టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ అని భోగట్టా! ఈ చిత్రాన్ని దొంగాట చిత్ర దర్శకుడు వంశీ కృష్ణ తెరకెక్కించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: