దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అంటుంటారు మన పెద్దలు. ఇప్పుడు మన హీరోలు అదే ఫాలో అవుతున్నారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యాడ్స్ తో ఇతర వ్యాపార రంగాలలో పెట్టుబడులు పెడుతూ చేతినిండా సంపాదిస్తున్నారు మన హీరోలు. కొందరు మాత్రం టీవీ షోస్ లో హోస్ట్ గా చేస్తున్నారు. ఇక ఒక్కొక్కరి గురించి చెప్పాలి అంటే.

రామ్ చరణ్ : సినిమాలు చేస్తూనే తండ్రి మెగాస్టార్ తో నిర్మాతగా ఇతర హీరోలను నిర్మిస్తూ మరో పక్క ట్రూజెట్ పేరుతో విమాన సర్వీసులు నడుపుతున్నారు అట మన రామ్ చరణ్.
కింగ్ నాగార్జున..... ఇక మన కింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు పబ్  బిజినెస్ రెస్టారెంట్స్ వంటి వాటిలో చేరుతున్నారు. మొన్నటిదాకా మాటీవీలో ఎంత వాటా ఉండేది. ఇక అన్నపూర్ణ థియేటర్ నిర్వహణ, సినిమా నిర్మాణం గురించి తెలిసిందే.

అల్లు అర్జున్ :  ఇక స్టైలిష్స్టార్ అయితే సినిమాలతోపాటు జూబ్లీహిల్స్లో ఒక పబ్ నీ స్టార్ట్ చేశారు. దాంతోపాటు గచ్చిబౌలిలో లో ఒక రెస్టారెంట్ ని కూడా స్టార్ట్ చేసాడు అల్లు అర్జున్. ఇవే కాక ప్రస్తుతం అమీర్పేట సత్యం థియేటర్ నీ మల్టీప్లెక్స్ గా మారుస్తున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు : ఇక ఈ మిల్క్ బాయ్ సినిమాల్లో నటిస్తూనే యాడ్స్ లో కూడా నటిస్తున్నాడు. అలాగే వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టాడు. ఇక నిర్మాత గా మారడంతో పాటు ఏషియన్ మూవీస్ తో కలిసి ఏ ఎం బి మల్టీ ఫ్లెక్స్ థియేటర్ నీ అదునాతన వసతులతో నిర్మించాడు. ఇక ఇప్పుడు తాజాగా మెన్స్ వేర్ క్లాత్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు.

శర్వానంద్ : ఈ హీరో కూడా అ జూబ్లీహిల్స్ లో బెంచ్ పేరిట ఒక కాఫీ హౌస్ ని స్టార్ట్ చేశారు. శ్రీ విద్యానికేతన్ పేరిట మోహన్ బాబు ఒక స్కూల్ నిర్వహిస్తుండగా న్యూయార్క్ అకాడమీ పేరిట జూబ్లీహిల్స్ లో కూడా ఒక స్కూల్ ని స్టార్ట్ చేశారు.

జగపతి బాబు : ఈ హీరో కూడా క్లిక్ పేరుతో టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేశారు. రౌడీ స్టార్ అయిన విజయ్ దేవరకొండ మూవీస్ చేస్తూనే క్లాత్ బిజినెస్ రౌడీ బ్రాండ్ పేరిట స్టార్ట్ చేశారు. ఏషియన్ సినిమా తో కలిసి మహబూబ్ నగర్ లో ఏ వి డి పేరుతో ఒక థియేటర్ నీ నిర్మించారు.

సందీప్ కిషన్ : వివాహ భోజనంబు పేరిట 2016 లోనే ఒక రెస్టారెంట్ లో ఓపెన్ చేసాడు సందీప్ కిషన్. హైదరాబాదులో ప్రస్తుతం మూడు రెస్టారెంట్లు ఉన్నాయి. నందమూరి కళ్యాణ్రామ్ ఒకవైపు సినిమాలు చేస్తూ నిర్మిస్తూ మరోవైపు క్రియేటివ్ పేరిట అద్విత పేరిట వి  ఎఫ్ ఎక్స్ స్టూడియో స్టార్ట్ చేశారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: