తెలుగు సినిమా పరిశ్రమలో కొంతమంది యాంకర్లు బాగా హడావుడి చేస్తూ వస్తున్నారు. అందులో ప్రధానంగా అనసూయ ఈ మధ్యకాలంలో మీడియాలో ఎక్కువగా వార్తల్లో ఉంటోంది. ఇక అనసూయ సినిమాలు చేస్తే కచ్చితంగా ఆ సినిమా విజయవంతం అవుతుంది అనే నమ్మకం కూడా కొంతమంది దర్శక నిర్మాతల్లో ఉంది అనే వ్యాఖ్యలు కూడా టాలీవుడ్ వర్గాల్లో వినబడుతూ ఉంటాయి. అనసూయ తెలుగులో రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాల తర్వాత అనసూయ ఏ విధంగా ప్లాన్ చేస్తుంది ఏంటనే దానిపై క్లారిటీ లేకపోయినా అనసూయ మాత్రం భారీ ఆఫర్ వచ్చిందని వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో వినబడుతున్నాయి.

అనసూయ ప్రస్తుతం ఉన్న సినిమాలో నటిస్తుండగా కొరటాల శివ అల్లు అర్జున్ సినిమాలో అల్లు అర్జున్ కి అమ్మ పాత్రలో నటించే అవకాశం ఉంది అనే వార్తలు వినపడుతున్నాయి. దీనికి సంబంధించి కొరటాల శివ ఇప్పటికే ఆమెకు ఆమెకు కథ కూడా చెప్పారని సమాచారం. ఆమె కూడా కథ నచ్చడంతో ఏ మార్పులు అడగలేదు అనేది కూడా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అనసూయకు సోషల్ మీడియాలో కాస్త క్రేజ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొంతమంది దర్శక నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు.

ప్రముఖ దర్శకుడు సుకుమార్ అలాగే రామ్ చరణ్ హీరోగా వచ్చిన సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించారు.  సినిమాలో ఆమె పాత్ర బాగా హిట్ అవ్వడమే కాకుండా నటిగా మంచి పేరు తీసుకువచ్చింది. దీంతో కొన్ని కొన్ని కీలక పాత్రకు సంబంధించి అనసూయ పేరు ఎక్కువగా టాలీవుడ్ ప్రస్తావిస్తుంది. దీంతో త్వరలోనే అనసూయ మరింతగా బిజీ అయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది తెలియాలంటే కొంత కాలం ఆగాలి మరి. ప్రస్తుతం అనసూయ టీవీ కార్యక్రమాల్లో ఎక్కువగా బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: