ఐటమ్ సాంగ్ అంటే టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఎంతో ప్రేమ. అందుకే ఎప్పటినుంచో తప్పకుండా ఐటమ్ సాంగ్ ను తమ సినిమాలలో పెడుతూ మాస్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటారు. కథ ఎలా ఉన్నా కూడా సినిమా ఎలాంటిదైనా కూడా ఐటెం సాంగ్ ని పెట్టి ఆ సినిమాపై మంచి క్రేజ్ ను తీసుకు వచ్చేవారు. పెద్ద హీరోలు చిన్న హీరోలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క హీరో కూడా ఐటమ్ సాంగ్ తమ సినిమాల్లో పెట్టి సినిమా బిజినెస్ పరంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఐటెం సాంగు కోసం హీరోయిన్లను కూడా రంగంలోకి దింపడం పట్ల ఈ పాటకు ఉన్న ప్రాముఖ్యత అర్థమవుతుంది.

గతంలో ఐటెం సాంగ్ కోసం కొంతమంది ప్రత్యేకంగా నటీమణులు ఉండేవారు కానీ ఇప్పుడు హీరోయిన్ లు సైతం సై అంటున్నారు. పతి తెలుగు సినిమాలో ఐటం పాట కూడా ఒక భాగమయ్యింది. ఆ విధంగా అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ప్రేమ్ నగర్ సినిమాలో లే లే లే నా రాజా పాట ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా ప్రేమ కథ అయినప్పటికీ ఐటెం సాంగు పెట్టి ఈ సినిమాకే హైలెట్ అయ్యేలా చేశారు చిత్ర దర్శకులు. 

1971 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది అని చెప్పవచ్చు. ఎన్నో ఫ్లాప్ లతో భారీ నష్టాన్ని చూస్తున్న నిర్మాత రామానాయుడు ఈ సినిమాతో మంచి విజయం సాధించుకొని లాభాల బాటలోకి వచ్చి అగ్రనిర్మాత గా నిలదొక్కుకున్నారు. ఈ చిత్రంలోని ప్రతి పాట కూడా ఆల్ టైం హిట్ లు గా నిలవగా కె వి మహదేవన్ సంగీతం అందించిన ప్రతి పాట కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా ఈ ఐటెం సాంగ్ ఇప్పటికీ క్రేజ్ తగ్గని విధంగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఇదే ట్రెండ్ ను  ఇప్పుడు కొనసాగిస్తూ అన్ని చిత్రాలు కూడా ఐటం సాంగ్ లు పెడుతూ సినిమా పై క్రేజ్ వచ్చేలా చేసుకుంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: