ప్రస్తుతం పెద్ద హీరోల అప్డేట్ లు వరుసగా విడుదల అవుతూ ఉన్నాయి. అన్ని సినిమాలపై భారీ క్రేజ్ ఏర్పరుచుకునే విధంగా మేకర్స్ చేసుకుంటున్నారు.  ఇప్పటికే సంక్రాంతి సినిమాలకు సంబంధించిన అప్డేట్ లు అన్నీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. అంతేకాదు డిసెంబర్ లో విడుదల కాబోతున్న సినిమాల అప్డేట్ లను కూడా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ లో విడుదల కాబోతున్న ఓ రెండు సినిమాల అప్డేట్ లు దీపావళికి విడుదల అయ్యేలా ఆయా మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. మొదటి భాగం డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఇటీవలే యూట్యూబ్లో విడుదల అవుతూ భారీ హిట్లు అవుతూ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను దీపావళికి విడుదల చేసి ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేయాలని భావిస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చగా సినిమాగా ఐదు భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించ పోతుంది.

ఇక బాలకృష్ణ నటించిన అఖండ సినిమా కూడా డిసెంబర్లో విడుదల అవుతుంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన మరొక టీజర్ ను దీపావళి సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వచ్చిన రెండు టీజర్లు ను మించిన రేంజ్ లో ఈ టీజర్ ను రూపొందించాలని మంచి టీజర్ ను కట్ చేశారట. ఊర మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను అత్యంత భారీ బడ్జెట్ తో చేస్తున్న ఈ సినిమా టీజర్ ఎలా ఉండబోతుందో అని యావత్ తెలుగు నాడు ఎదురు చూస్తుంది. ఆ విధంగా ఈ రెండు సినిమాలలో ఏ టీజర్ విపరీతమైన ఆదరణ అందుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: