హీరోయిన్లు అంటే కేవలం సినిమాకి స్పెషల్ గ్లామర్ మాత్రమే కాదు సినిమా భారాన్ని కూడా మోయగలరని, సక్సెస్ ను అందుకోగలమని లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ఎందరో కథానాయకులు తమ సత్తా చాటారు. అంతే కాదు మంచి కథ అయి, క్రేజ్ లభిస్తుంది అనుకుంటే ఐటెం సాంగ్స్ లలో ఆడిపాడిన స్టార్ హీరోయిన్లు ఎందరో అలా కొందరు హీరోయిన్లు ఆడిపాడిన స్పెషల్ సాంగ్స్ లకు ఫుల్ క్రేజ్ లభించడమే కాదు, వారి గ్రాఫ్ కూడా అలా పెరిగిపోయింది. గతం లో స్పెషల్ సాంగ్స్ అంటే హీరోయిన్స్ ఆమడ దూరం ఉండేవారు. వారి ఇమేజ్ తగ్గిపోతుందని ఫీల్ అయ్యేవారు. అయితే ఇపుడు స్టార్ హీరోయిన్స్ సైతం వరుసగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసారు.

టాలీవుడ్ లో పలు చిత్రాలలో హీరోయిన్స్ చేసిన స్పెషల్ సాంగ్స్ ఫుల్ ఫేమస్ అయ్యాయి. టాలీవుడ్ నే షేక్ చేసిన ఆ స్పెషల్ సాంగ్స్, ఆ హీరోయిన్స్ ఎవరో ఒకసారి చూద్దాం.  

* తమన్నా భాటియా జయ లవకుశ చిత్రంలో చేసిన స్పెషల్ సాంగ్  "స్వింగ్ జర స్వింగ్ జర"..పాట ఒక ఊపు ఊపింది.  స్వింగ్ జరా అంటూ తమన్నా తన డాన్స్ తో మత్తెక్కించే కళ్ళతో  తెలుగు ప్రేక్షకులను మైమరిపించింది.
సరిలేరు నీకెవ్వరు చిత్రం లోనూ "తు ఆజాన" అంటూ స్పెషల్ సాంగ్ లో కనిపించి మురిపించింది జీరో సైజ్ నడుం బామ తమన్నా. ఈ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.

* రంగస్థలం చిత్రంలో పూజ హెగ్డే  చెర్రీతో కలసి "జిల్ జిల్ జిల్ జిగేలు రాణి" అంటూ ఆడిపాడిన ఆ పాట అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించింది స్టెప్పులేసేలా చేసింది.

* టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన "జనతా గ్యారేజ్" చిత్రంలో నేను పక్కా లోకల్ అంటూ స్పెషల్ సాంగ్ లో అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యింది అంటే...మాస్ సాంగ్స్ నచ్చని వాళ్ళు సైతం ఈ పాట వస్తే స్టెప్పులు వెయ్యాల్సిందే.

* రామ్ పోతినేని రామ్ నటించిన  రెడ్ చిత్రంలో హెబ్బ పటేల్ ఐటెం సాంగ్ లో అదరగొట్టింది.

ఈ విధంగా పలువురు హీరోయిన్లు సైతం ఐటెం సాంగ్ లు చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: