బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండిల్‌వుడ్‌ ఇలా అదీఇదీ అనేది లేకుండా అన్ని ఇండస్ట్రీలకు చెందిన పాపులర్‌ స్టార్‌ హీరోలు, హీరోయిన్లు వెండి తెరతోపాటు బుల్లితెరపైనా మెరిసిపోతున్నారు. టాక్‌ షోలు, రియాలిటీ షోలతో పాటు పలు ప్రోగ్రామ్‌లకు అతిథులుగా, యాంకర్‌లుగా వచ్చి మెప్పిస్తున్నారు. టాలీవుడ్‌లో చూస్తే హీరోలు నాగార్జున, యంగ్‌ టైగర్‌ ఎన్‌టీఆర్‌, నేచురల్‌ స్టార్‌ నాని, దగ్గుబాటి రానా, నాగబాబు, హాస్య నటుడు అలీ, హీరోయిన్లు రోజా, సమంత, ప్రియమణి తదితరులు గెస్టులుగా, యాంకర్లుగా బుల్లితెరపై ఉన్నారు. కొందరు ఇంకా ఉంటున్నారు. గతంలో మెగాస్టార్‌ చిరంజీవి మెప్పించారు కూడా. ఎందుకంటే- టాక్‌ షో, రియాలిటీ షోలకు గెస్ట్‌లుగా, యాంకర్‌లుగా వచ్చేవారికి భారీ పారితోషికం ముట్టడమే కాకుండా మంచి ఫేమ్‌ కూడా వస్తుంది. అందుకే ఇంకా మరికొందరు స్టార్‌లు ఈ లిస్టులో జాయిన్‌ అయ్యేందుకు ఆసక్తి చూపుతుంటారు.

అయితే ఇప్పుడు "ఆహా" ఓటీటీలో టాక్‌ షోకు అనుహ్యంగా బాలయ్య పేరు ఖరారు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో "ఆహా" ఓటీటీలో "అన్‌స్టాపబుల్‌ టాక్‌ విత్‌ ఎన్‌బీకే"  ప్రోగ్రామ్‌ ద్వారా బాలయ్య తీసుకునే పారితోషికం భారీగానే ఉంటుందని పుకార్లు షికార్లు చేశాయి. సుమారు 4 నుంచి 5 కోట్ల రూపాయల వరకు బాలయ్య టాక్ షోకు రెమ్యునరేషన్‌ ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయంలో కూడా బాలయ్య అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. తన మంచి మనసును చాటుకున్నారు. "ఆహా" టాక్‌ షో ద్వారా వచ్చిన రెమ్యునరేషన్‌ మొత్తాన్ని చారిటీకి ఉపయోగించాలని బాలకృష్ణ నిర్ణయం తీసుకున్నారట. బసవ తారకం క్యాన్సర్‌ ఆసుపత్రి సహా వివిధ సేవా కార్యక్రమాలకు ఆ మొత్తాన్ని ఉపయోగించేలా ప్రణాళిక రచించారట.

నిజానికి  బాలయ్యతో ప్రమోట్‌ చేయనున్న "ఆహా" టాక్‌ షో మొదటి సీజన్‌కు గాను ఆయనకు ఏకంగా నాలుగు కోట్ల రూపాయలకుపైగానే రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంత భారీ మొత్తాన్ని ఛారిటీకి డొనేషన్‌గా ఇవ్వడమంటే మామూలు సంగతి కాదు. ఈ వితరణ ద్వారా బాలయ్య ఉదార స్వభావం కలవాడని, భోళా శంకరుడు అని మరోసారి రుజువు అయిందని ఆయన అభిమానులు అంటున్నారు. బాలయ్య మంచితనాన్ని వివరించడానికి ఇంతకంటే నిదర్శనం ఏముందని కూడా వారు అంటున్నారు. మొత్తంమీద "ఆహా" టాక్‌ షో రెమ్యునరేషన్‌ను బాలయ్య తీసుకోకుండా.. ఆ మొత్తాన్ని ఛారిటీకి ఇవ్వాలని అన్నారట. అందుకే బాలయ్య "ఆహా" టాక్‌ షోకు పారితోషికం వద్దన్నట్లుగా ప్రచారం జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: