మాస్ రాజా రవితేజ ఇప్పుడు మంచి స్పీడ్ మీద ఉన్నాడు. గత కొంతకాలంగా ఆయన వరుస సినిమాలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన హీరోగా నటించబోయే 71 వ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇప్పుడు అయింది. హీరోగా మాస్ రాజాకు ఇది 50వ చిత్రం కావడం విశేషం. కాగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో రవితేజ చిత్రీకరించడం మరింత విశేషం. ఎప్పటినుంచో టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ ఆధారంగా సినిమా చేయాలని ఎంతో మంది ప్రయత్నించారు.

కానీ ఇప్పుడు ఆ సినిమా రవితేజ చేయడం ఒక్కసారిగా టాలీవుడ్ లో సంచలనం కలిగిస్తుంది. ఈ చిత్రం రవితేజ తన కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా సినిమాగా చేయనున్నాడు. ఇంతకుముందు చిన్న సినిమాలను క్రైమ్ కామెడీ చిత్రాలను రూపొందించిన వంశీ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా 80వ దశకంలో భారీ ఎత్తున దొంగతనాలు చేస్తూ జనాలకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది.

అయితే ముందుగా బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తాడని ఆ చిత్రానికి స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. బెల్లం కొండ శ్రీనివాస్ తండ్రి సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఇప్పుడు అదే కథ తో రవితేజ ప్రేక్షకుల ముందుకు రావడం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది.  మరి రెండు ఒకే కథతో వస్తే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. మరోవైపు శ్రీనివాస్ చత్రపతి హిందీ రీమేక్ పనుల్లో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమాను మొదలు పెట్టాలని భావించగా రవితేజసినిమా చేయడం పట్ల బెల్లంకొండ శ్రీనివాస్ ఏ విధంగా ఈ సినిమాతో అలరిస్తాడు అన్న అనుమానాలు తప్పకుండా ఏర్పడుతున్నాయి. జి వి ప్రకాష్ కుమార్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: