అక్కినేని నాగార్జున హీరోగా యువ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వమో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా సోగ్గాడే చిన్ని నాయన. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో రమ్య కృష్ణ ఒక కీలక పాత్ర చేయగా యూత్ భామ లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. నాగార్జున డ్యూయల్ రోల్ చేసిన ఈ సోసియో ఫాంటసీ కమర్షియల్ ఎంటర్టైనర్ ని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా ఎంతో అద్భుతంగా తీశారు కళ్యాణ్ కృష్ణ. సూపర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా చాలా ఏరియాల్లో మంచి కలెక్షన్ సంపాదించింది.

ఇక కొంత గ్యాప్ తరువాత దీనికి సీక్వెల్ గా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా బంగార్రాజు. నాగార్జున తో పాటు నాగ చైతన్య కూడా నటిస్తున్న ఈ సినిమాలో ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా రమ్యకృష్ణ ఇందులో కూడా ముఖ్య పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మొదటి భాగం కంటే కూడా మరింత అద్భుతంగా తెరకెక్కుతోందని, తప్పకుండా సినిమా విడుదల తరువాత ఆడియన్స్ ని ఎంతో అలరించి సూపర్ డూపర్ హిట్ కొట్టడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అసలు విషయం ఏమిటంటే ఇటీవల ప్రారంభం అయిన బంగార్రాజు మూవీ ని ఎట్టి పరిస్థితుల్లో రాబోయే సంక్రాంతి బరిలో నిలిపేలా దర్శక నిర్మాతలు గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని జనవరి 15 గా నిర్ణయించిందట యూనిట్. ఆ విధంగా పక్కాగా అదే తేదీన సినిమా రిలీజ్ చేసేందుకు అన్ని విధాలా యూనిట్ షూటింగ్ ప్రణాళికలు కూడా పూర్తి చేస్తోందట. అయితే ఇంతవరకు అంతా బాగానే ఉన్నప్పటికీ, సరిగ్గా సంక్రాంతి రేస్ లో భారీ పాన్ ఇండియా సినిమాలైన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటివి ఉండడంతో వాటి మధ్యన బంగార్రాజు ఎంతవరకు తట్టుకుని నెగ్గుకురాగలడు అంటూ కొందరు సినిమా ప్రేక్షకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంక్రాంతి సమయంలో మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని, అలానే తమ సినిమా కథ, కథనాలపై గట్టి నమ్మకంతోనే దీనిని సంక్రాంతి బరిలో నిలుపుతున్నట్లు బంగార్రాజు యూనిట్ చెపుతోందట. మరి ఆ సమయంలో గట్టి పోటీ మధ్యన విడుదల కానున్న బంగార్రాజు ఏ స్థాయిలో ఆడియన్స్ ని ఆకట్టుకుంటాడో తెలియాలి అంటే మరొక మూడు నెలలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: