బిగ్ బాస్ తెలుగు కార్యక్రమం టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న విషయం అందరికి తెలిసిందే. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లతో అయోమయం లో ఇంటి సభ్యులు ఉన్నారు. కొందరు మైండ్ గేమ్ ఆడితే మరి కొందరు అంతకు మించి ఆడుతున్నారు . ఇంటి సభ్యులు ఎవరి గేమ్ వారు ఆడుతూ అస్సలు తగ్గేదే లే అన్నట్లు ఆడుతూ ఉన్నారు. ఇప్పటివరకు బిగ్ బాస్ ఎనిమిది వరాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం వీకెండ్ ఫీవర్ పట్టుకుంది . ప్రేక్షకుల్లోనూ మరియు కంటెస్టెంట్ లలోను ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్న గుబులు మొదలయ్యింది. ప్రస్తుతం తొమ్మిదవ వారం నడుస్తూవుంది. 


IHG


ఇంటి బయటకు వెళ్లటానికి ఎన్నికైన సభ్యులలో రవి , సన్నీ , మానస్ , సిరి , జస్వంత్ , పింకీ , కాజల్ మరియు విశ్వ లు ఉన్నారు. అయితే ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఇంటి సభ్యురాలిగా సిరి ఉంటుందని అనుకున్నారు. కానీ ఈ వారం పోలైన ఓట్స్ తో సిరి అనూహ్యంగా నాల్గవ స్తానం లో చేరింది.  వీజే సన్నీ కి అత్యధికంగా ఓట్స్ పోల్ అయ్యాయి. సెకండ్ ప్లేస్  లో శ్రీరామ చంద్ర  ఉన్నాడు , ఎప్పటిలాగానే యాంకర్ రవి మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు . అయితే ఈ వారం పోల్ ఐన ఓటింగ్స్ లో  ఊహించని విధంగా సిరి నాల్గవ స్తానం లో కొనసాగుతోంది . అయితే షణ్ముఖ్ ఫాలోవర్లు సిరికి ఓట్స్ వేస్తారనుకున్నారు కానీ ఆమెకు ఈ వారం కూడా చాల తక్కువ ఓట్లు పోల్ అయ్యాయి.


IHG సిరి తరువాత స్తానం లో జస్వంత్ ఉన్నాడు. జస్వంత్ తరువాత స్తానం లో పింకీ ఉంది . అయితే చివరి రెండు స్థానాలలో కాజల్ మరియు విశ్వ లు ఉన్నారు. కాజల్ మరియు విశ్వ ల  ఓటింగ్ గమనించినట్లయితే వీరిద్దరిమద్య కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే వ్యత్యాసం గా కనిపిస్తున్నాయి. అయితే కాజల్ విస్వ కంటే ఒక్క శాతం ఓట్ల తో  బెటర్ పొజిషన్ లో ఉంది. విశ్వా కి అందరికంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. అంటే ఈ వారం ఎలిమినేషన్ లో విశ్వా కచ్చితంగా ఎలిమినేట్ అయ్యేచాన్సు ఉంది. అయితే ఈ ఓటింగ్ అంతా కూడా అనఫీసియల్ గా మాత్రమే అధికారికంగా బిగ్ బాస్ ప్రకటించవలసి ఉంది. అయితే ఈ వారం డేంజర్ జోన్ లో మాత్రం కాజల్ మరియు విశ్వాలు ఉన్నారు. తుది నిర్ణయం మాత్రం బిగ్ యాజమాన్యానిదే.  
IHG

మరింత సమాచారం తెలుసుకోండి: