పునీత్ రాజ్కుమార్ మరణాన్ని ఇప్పటికీ కూడా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం 46 ఏళ్ల వయసులోనే పునీత్ రాజ్కుమార్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే పునీత్ అకాల మరణం అటు చిత్రపరిశ్రమ మొత్తం శోకసంద్రంలోకి నెట్టింది. పునీత్ రాజ్కుమార్ లాంటి ఒక గొప్ప నటుడు గొప్ప వ్యక్తి చిత్ర పరిశ్రమకు దూరం కావడం మాత్రం తీరని లోటు అంటూ ఎంతో మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అన్న విషయం తెలిసిందే. కేవలం కన్నడ హీరోలు మాత్రమే కాదు తెలుగు హీరోలు సైతం తమకు పునీత్ రాజ్ కుమార్ తో ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తుచేసుకున్నారు.



 అయితే పునీత్ రాజ్కుమార్ ఓవైపు కన్నడ ఇండస్ట్రీ లో పవర్ స్టార్ గా కొనసాగుతూ వరుస సినిమాలతో బిజీగా ఉండటమే కాదు ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేపట్టి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది నిరుపేదలకు సహాయపడే విధంగా ఆస్పత్రులను కూడా కట్టించారు. ఇక ఎంతో మంది అనాథలను చేరదీసేందుకు అనాధ ఆశ్రమాలు కూడా పెట్టించారు. చివరికి చనిపోయిన తర్వాత కూడా తన కళ్ళను దానం చేసి వేరొకరికి చూపు కల్పించారు పునీత్ రాజ్కుమార్. అయితే  పునీత్ రాజ్కుమార్ మరణం తర్వాత ఇక ఆయన సేవా కార్యక్రమాలు అన్నీ నిలిచిపోయాయి. ఎంతో మంది ఆయన సేవా కార్యక్రమాల బాధ్యతలు తీసుకుంటున్నారు  అన్న విషయం తెలిసిందే.



 ఇక మరికొంతమంది పునీత్ రాజ్కుమార్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా పునీత్ మరణాన్ని కూడా క్యాష్ చేసుకుంది ఒక ఆసుపత్రి బెంగుళూరులోని ఓ డయాగ్నస్టిక్స్ సెంటర్. పునీత్ మరణంపై సంతాపం తెలియజేస్తూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫ్రీగా అందరికీ గుండె ఇతర టెస్టులు చేస్తాము అంటూ వెల్లడించింది ఆ డయాగ్నస్టిక్ సెంటర్. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ బిపి ఈసీజీ కొలెస్ట్రాల్ లాంటి చెక్ అప్ చేసుకుంటే 300 రూపాయలు అంటూ బేరం మొదలుపెట్టింది ఆ డయాగ్నొస్టిక్ సెంటర్. ఇది చూసిన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: