ఫుల్ డిసప్పాయింట్ లో ఉన్న రెజీనాకు శుభవార్త వినిపించింది. ఇంకేముందీ ఇప్పుడు ఆమె హృదయం ఉప్పొంగుతోంది. ఎక్కడలేని ఉత్సాహంతో.. చిరునవ్వులు చిందిస్తోంది. ఇన్నాళ్లూ ఒక్క హిట్ అయినా రాకపోతుందా.. మళ్లీ బిజీ కాకపోతామా అని రెజీనా చాలా రోజులుగా ఎదురు చూసింది. కానీ ఆ ఎదురు చూపులకు తెరపడింది. తెలుగు, తమిళ్, హిందీ ఇలా అన్ని ఇండస్ట్రీస్‌ తిరిగినా కెరీర్ మాత్రం మారలేదు. ఇలాంటి సమయంలో ఒక క్రేజీ ఆఫర్ అందుకుంది రెజీనా.

రెజీనాకి 'జ్యో అచ్యుతానంద' సినిమా తర్వాత సరైన హిట్ పడలేదు. ఒకటి. రెండు సంవత్సరాలు కాదు.. ఏకంగా ఐదేళ్లుగా రెజీనా వెయిటింగ్ చేస్తూ గడిపింది. ఆమెకు అన్నీ ఎదురుదెబ్బలే తగిలాయి. తమిళ్ లో కూడా అదృష్టం వరించలేదు. ఆశగా నటించినా పెద్దగా సక్సెస్‌ రాలేదు. దీంతో ఈ హీరోయిన్‌ కెరీర్‌ క్లైమాక్స్‌కి చేరింది. అద్భుతాల్లాంటి హిట్స్‌ పడితేగానీ, మళ్లీ జనాలకి చేరువయ్యే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో షాహిద్‌ కపూర్‌తో కలిసి నటించే అవకాశం అందుకుంది రెజీనా.

షాహిద్‌ కపూర్‌ ప్రస్తుతం రాజ్, డీకె దర్శకత్వంలో ఒక వెబ్‌ సీరీస్‌ చేస్తున్నాడు. 'ఫ్యామిలీమెన్' సీరీస్‌తో నేషనల్‌ వైడ్‌గా పాపులర్ అయిన రాజ్, డీకె తీస్తోన్న ఈ వెబ్‌ సీరీస్‌పై క్రేజీ బజ్ ఉంది. ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తున్నారో అని ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ సీరీస్‌లోనే నటిస్తోంది రెజీనా. షాహిద్ కపూర్‌తో పాటు, విజయ్‌ సేతుపతి, రాశీ ఖన్నా లీడ్‌ రోల్స్‌ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు వీళ్లతోపాటు రెజీనా కూడా ఒక ఇంపార్టెంట్‌ రోల్ ప్లే చేయబోతోంది. మరి ఈ వెబ్‌ సీరీస్‌తో రెజీనా కెరీర్‌ ఎలాంటి మలుపు తీసుకుంటుంది... సమంతలా వెబ్‌ సీరీస్‌తో నార్త్ మార్కెట్‌లో కూడా గుర్తింపు తెచ్చుకుంటుందా అనేది చూడాలి. మరి షాహీద్ కపూర్ తో నటిస్తున్న ఈ అమ్మడు.. వెబ్ సిరీస్ ద్వారా మళ్లీ పుంజుకుంటుందా లేదా చూద్దాం.. రెజీనాకు ఆల్ ది బెస్ట్ అయితే చెబుదాం.


మరింత సమాచారం తెలుసుకోండి: