అనుష్క శెట్టి.. ఈమె మొదట తన కెరియర్ ను యోగా టీచర్ గా మొదలు పెట్టి ఆ తరువాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పూరి జగన్నాథ్ దర్శకుడిగా, మన్మధుడు నాగార్జున హీరోగా తెరకెక్కిన సూపర్ చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన స్వీటీ, ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నా..ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది. ఒక పాత్రలో లీనమైపోయి చేసే స్వభావం స్వీటీ కి ఉందని చెప్పవచ్చు. ఈమె ఒక పాత్ర కోసం తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి నటించగల కెపాసిటీ స్వీటీకి ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. సైజ్ జీరో సినిమా గురించి తెలిస్తే , ఆమె త్యాగానికి గొప్ప నిర్వచనం అని చెప్పవచ్చు.

లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా తనదైన శైలిలో నటించి అందరినీ ఆకట్టుకుంది స్వీటీ.. ఇదిలా ఉండగా ఈమె సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఎంత సంపాదించింది..ఇక మొత్తంగా ఈమె దగ్గర ఎంత ఆస్తి ఉంది అనే విషయం తెలుసుకున్నట్లయితే.. అనుష్క తన దగ్గర పనిచేసే కార్ డ్రైవర్ కు ఏకంగా 12 లక్షల రూపాయలు వెచ్చించి ఒక కారు గిఫ్ట్ గా ఇచ్చింది.ప్రస్తుతం స్వీటీ బెంగళూరు లో తన నివాసం ఉంటున్న ఇంటి ధర ఏకంగా 12 కోట్ల రూపాయలు. సుమారుగా 50 సినిమాలకు పైగా నటించిన స్వీటీ 150 కోట్ల రూపాయలు వెనుక వేసినట్లు సమాచారం. అంతేకాదు సుమారుగా 20 నుంచి 30 కోట్ల రూపాయలు వరకు వాణిజ్య ప్రకటనల ద్వారా సొంతం చేసుకుందట.

అంతేకాదు బెంగళూరు, హైదరాబాద్ , మంగళూరు, వైజాగ్ వంటి మహానగరాలలో ఈమెకు స్థిరాస్తి ఉన్నట్లు కూడా సమాచారం. అంతేకాదు స్వీటీ తన డబ్బులను మొత్తం విలువైన కార్లు, ఖరీదైన వజ్రాలు, బంగారం వంటివి కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తుందట. ఇక ఇంత సంపాదించిన అనుష్క ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడం వెనుక రకరకాల కథనాలు వస్తున్నప్పటికీ, ఆమె ఏమాత్రం స్పందించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: