యంగ్ హీరో బెల్లంకొండ శ్రీను కు ఇప్పటివరకు ఒక్క సరైన హిట్ రాకపోయినా వరసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ప్రభాస్ ను మాస్ హీరోగా మార్చిన ‘ఛత్రపతి’ రీమేక్ ను ధైర్యంగా హిందీలో చేస్తున్నాడు. అలాంటి శ్రీనుకు ఇప్పుడు అనుకోకుండా మాస్ మహారాజ రవితేజాతో రగడ ఏర్పడే సంకేతాలు కనిపిస్తున్నాయి.


ఒకే కథతో రెండు సినిమాలు రావడం ఇండస్ట్రీలో కొత్త కాదు ఇలా వచ్చినప్పుడల్లా అనేక వివాదాలు జారుతూనే ఉంటాయి. బెల్లంకొండ శ్రీను ను హీరోగా పెట్టి అతడి తండ్రి బెల్లంకొండ సురేష్ ‘స్టూవర్టుపురం దొంగ’ అనే మూవీని ప్రకటించాడు. ఈమూవీ కథ ఒక గజదొంగ జీవిత కథ ఆధారంగా నిర్మించబడుతోంది అంటూ లీకులు వచ్చాయి.


ఈసినిమా షూటింగ్ పూర్తి కాకుండానే లేటెస్ట్ గా టైగర్ నాగేశ్వరావు అనే మూవీ ప్రకటన కూడ వచ్చింది. గజదొంగ గా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఇది. ఈమూవీలో నటించినందుకు రవితేజా కు 18 కోట్లు పారితోషికం ఇస్తున్నట్లు టాక్. 1970 కాలంలో స్టూవ‌ర్టుపురం ప్రాంతానికి చెందిన ప్ర‌ముఖ గ‌జ‌దొంగ ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర రావు’ బ‌యోపిక్ ఇది. రెండు సినిమా యూనిట్లు ఈవిషయాన్ని ప్రకటించాయి.


ఈమూవీ కథ పై దర్శకుడు వంశీ గత మూడు సంవత్సరాలుగా పని చేస్తున్నట్లు చెపుతున్నాడు. అయితే ఈవిషయంలో ఇక్కడ ఇంట్రస్టింగ్ ట్విస్ట్ కనిపిస్తోంది. వాస్తవానికి ఇదే దర్శకుడు కొంత కాలం క్రితం బెల్లంకొండను కలిసి ఈ కథ చెప్పాడట. అయితే బెల్లంకొండ నుండి స్పందన రాకపోవడంతో ఈ దర్శకుడు రవితేజా ను కలిసి ఈమూవీ కథను చెప్పడం ఒకే చేయడం జరిగింది అంటున్నారు. ఈ గ్యాప్ లో బెల్లంకొండ ఇదే కథను కె ఎస్ అనే దర్శకుడుని పరిచయం చేస్తూ ‘స్టూవర్టుపురందింగ’ మూవీగా తీస్తున్నాడు. రవితేజ సినిమాలో ఉన్న సన్నివేశాలే బెల్లంకొండ సినిమాలో కూడా రిపీట్ అవుతాయి అంటున్నారు. దీనితో ఎవరి కోసం ఎవరు కథలో మార్పులు చేసుకుంటారు అంటూ చర్చలు జరుగుతున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: