తెలుగు చిత్ర పరిశ్రమలో క్వీన్ గా కొనసాగుతూ తనకు తిరుగులేదని నిరూపించుకుంది అనుష్క. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరికీ కూడా జేజమ్మగా కొనసాగుతోంది. ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో అనుష్క చేసినన్ని వైవిధ్యమైన పాత్రలు ఏ హీరోయిన్ కూడా కనీసం ప్రయత్నించ లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గ్లామర్ పాత్రల దగ్గర నుంచి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు.. హిస్టారికల్ పాత్రల వరకూ కూడా అన్ని పాత్రలలో నటించి అదరగొట్టింది. సూపర్ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అనుష్క ఇక మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ విజయం సాధించింది.


 ఇక కెరీర్ మొదట్లో నటన రాక ఇబ్బందిపడిన అనుష్క ఆ తర్వాత మాత్రం ఏకంగా నటనకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. మొదట్లో ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించి అదరగొట్టిన అనుష్క అరుంధతి అనే సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది అని చెప్పాలి. ఇక దాదాపు దశాబ్ద కాలానికి పైగా నే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది ఈ ముద్దుగుమ్మ. అయితే సినిమాల్లో ఎంత గ్లామర్గా కనిపించినప్పటికీ బయట మాత్రం ఎంతో హుందాగా ఉంటుంది అనుష్క.



 సాఫీగా సాగిపోతున్న అనుష్క కెరీర్ ని ఒక్కసారిగా దెబ్బతీసింది మాత్రం ఒకే ఒక్క సినిమా. అదే అనుష్క ప్రయోగం చేసిన సైజ్ జీరో సినిమా.  అప్పటి వరకు ఎంతో నాజూకు గా ఉండేది అనుష్క. యువ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నది. కానీ సైజ్ జీరో సినిమాతో ఒక్కసారిగా లావుగా తయారైంది. ఎంతలా అంటే అసలు కనిపించేది అనుష్కనేనా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయేంత లావు గా మారింది. ఇంత కష్టపడి అనుష్క ప్రయోగం చేస్తే సైజ్ జీరో సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక ఈ సినిమా కెరియర్ కు ఉపయోగ పడకపోగా ఇక ఈ సినిమాలో అనుష్క లావు పెరగడం తో కెరియర్ మొత్తం  దెబ్బతింది. ఆ తర్వాత లావు తగ్గడానికి అనుష్క ఎంతో ప్రయత్నాలు చేసినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరోల హవా పెరిగిపోయింది దీంతో ఇక లావు తగ్గినప్పటికీ అనుష్క కి అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. కేవలం లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేసుకుంటూ పోతుంది ప్రస్తుతం అనుష్క.

మరింత సమాచారం తెలుసుకోండి: