తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటేలా చేసిన సినిమా ఏది అంటే అందరు టక్కున చెప్పే పేరు బాహుబలి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్ గా.. దగ్గుబాటి రానా విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని కూడా మంత్రముగ్ధుల్ని చేసింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడాసినిమా చూస్తున్న సగటు ప్రేక్షకుడికి రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది.



 అయితే ఇలా ప్రేక్షకుల మన్ననలు పొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ అనేది ఎంత కీలకం గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముందుగా ప్రభాస్ కొండకోనల్లో నివసించే దంపతుల కుమారుడు గా కనిపిస్తాడు  కానీ ఆ తరువాత ఒకానొక సమయంలో తాను ఒక రాజు కొడుకుని అన్న విషయాన్ని తెలుసుకుంటాడు. అలాంటి రాజు ఏకంగా నమ్మిన బంటుగా ఉన్న కట్టప్ప చేతిలోనే చనిపోవడం ఎలా జరిగింది అన్న విషయమే ఇక ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ గా ఉంటుంది. అయితే మొదటి పార్ట్ మొత్తం ఫ్లాష్ బ్యాక్  లేకుండానే ముందుకు నడిపించాడు దర్శకుడు రాజమౌళి.


 ఇక ఫ్లాష్ బ్యాక్  మొత్తాన్ని కూడా ఇక రెండవ భాగంలో తెరకెక్కించాడు. బాహుబలి చిన్నప్పటి నుంచి పెద్దయ్యేదాకా ఎలా పెరిగాడు యుద్ధంలో ఎంత సమర్ధుడు అన్న విషయాన్ని కూడా కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఆ తర్వాత కట్టప్ప బాహుబలినీ వెన్నుపోటు పొడవడానికి కారణం ఏంటి అన్నది కూడా చూపించి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచాడు రాజమౌళి. బాహుబలి సినిమా అంత పెద్ద విజయం సాధించడానికి ఈ సినిమాలో ఉండే ఫ్లాష్ బ్యాక్ ఎంతో కీలకం అని చెప్పాలి. అయితే మొదటి భాగం సినిమా పూర్తయిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ పై  భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు మించిన రేంజ్ లోనే తెరకెక్కించి ఆశ్చర్యపరిచాడు జక్కన్న .

మరింత సమాచారం తెలుసుకోండి: