తెలుగు చిత్ర పరిశ్రమలో మకుటంలేని మహారాణిగా కొనసాగుతూ ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని దూసుకు పోతుంది అనుష్క. తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు దశాబ్ద కాలం గడిచిపోతుంది. కానీ ఈ అమ్మడికి మాత్రం ఇంకా క్రేజ్ తగ్గలేదు అని చెప్పాలి. కొంతమంది సీనియర్ హీరోయిన్ అయ్యింది అని అంటున్నప్పటికీ ఈ అమ్మడికి మాత్రం వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది.


 ఇక ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమాలో రవితేజ సరసన నటించి ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అరుంధతి సినిమాలో నటించడంతో ఈ అమ్మడి కెరీర్ మలుపు తిరిగింది. అప్పటి నుంచి ఈ అమ్మడు ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడమే కాదు.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో కూడా నటించింది. ఇక అరుంధతి సినిమాతో లేడి ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా అందరు దర్శకులకు అనుష్క కనిపించింది.


 ఇక ఆ తర్వాత రుద్రమదేవి సైజ్ జీరో భాగమతి సినిమాల్లో కూడా నటించి ప్రస్తుతం టాలీవుడ్ క్వీన్ గా మారిపోయింది అనుష్క. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. అయితేఅనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి అనే విషయం తెలిసిందే. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరు ఎలా మారింది అనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తను ఇంటర్ చదువుతున్న సమయంలో ఆడిషన్ కి వెళ్ళిన సమయంలో స్వీటీ అని తన పేరు రాయాగానే ముద్దు పేరు బాగుంది అసలు పేరు రాయి అని చెప్పారు. ఆ టైం లో ఏదోలా అనిపించింది.. ఇక 23 ఏళ్ల వయసులో స్వీటీ అనే పేరు కూడా బాగా లేదని కొంతమంది అన్నారట. దీంతో తనకు తానే అనుష్క అని పేరు పెట్టుకుంది ఈ అమ్మడు. ఇక ఈ పేరుకు అలవాటు పడడానికి దాదాపు ఏడాది పట్టిందట. ఇలా ఇక స్వీటీ శెట్టి కాస్త అనుష్క గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: