పూరిజగన్నాథ్ దర్శకత్వం లో సూపర్ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ గా అనుష్క శెట్టి నటించింది. తన గ్లామర్ తో తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసింది. ఆదివారం అనుష్క శెట్టి  పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.. అయితే ఈ సందర్భంగా ప్రభాస్ అనుష్క కి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అనుష్క శెట్టి టాలీవుడ్ లో ఇప్పటివరకు 30 పైచిలుకు సినిమాలను చేసింది. ఆమె నటించిన అరుంధతి సినిమా ఆమెకు గొప్ప పేరుని సంపాదించి పెట్టింది. ఇండస్ట్రియల్ హిట్ గా సినిమా నిలిచింది. ఈ సినిమాతో అనుష్క పేరు దేశం మొత్తం మారుమోగి పోయింది. అయితే ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి బిగినింగ్ , బాహుబలి 2 ది ఎండ్ గేమ్ తో అనుష్క అందాల విందు హాలీవుడ్ దాక చేరింది.





ఆమె కొన్ని గొప్ప సినిమాలను ఎంచుకున్నప్పటికీ ఆమె తప్పుడు నిర్ణయాలతో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడ్డాయి . అయితే ఆమె ఒప్పుకొని కొన్ని సినిమాలు కూడా ఇండస్ట్రీలో మంచి టాక్ తో పాటు మంచి వసూళ్లను కొల్లగొట్టాయి . అందులో ప్రధానంగా చొప్పుకోదగ్గ ఛీనిమా ' మహానటి '. అవును నిజమేనండి ముందుగా ఈ సినిమాని అనుష్కానే చేయమని అడిగారట . స్వయంగా మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ అనుష్క శెట్టిని కలసి మహానటి కథను చెప్పాడంట . అయితే అప్పుడు భాగమతి షూటింగ్ లో బిజీ గా ఉన్న స్వీటీసినిమా చేయడానికి డేట్స్ ఇవ్వలేకపోయింది. అయితే ఈ సినిమా చేసే గొప్ప ఛాన్స్ ఆ తరువాత కీర్తి సురేష్ ని వరించింది. అయితే సావిత్రి పాత్రకు నటి కీర్తి సురేష్ జీవం పోసిందనే చెప్పాలి . చూడటానికి అచ్చం సావిత్రిని పోలి హావభావాలు పలికించింది. ఈ సినిమాని రూ. 23 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట గొప్ప టాక్ ని సంపాదించుకుంది. ఈ సినిమా దాదాపు రూ. 83 కోట్లు దాక వాసులు చేసింది.
IHG
 
అనుష్క పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుతు ఉంది . ఆ వీడియో సారాంశం ఏమిటంటే యూవీ క్రియేషన్స్ వారు అనుష్క శెట్టి తో చేయబోతున్నారు అని . ఐతే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఈ వార్త నానుతూ ఉంది కానీ యూవీ సంస్థ దీనిని అధికారికంగా ప్రకటించలేదు. అయితే అనుష్క పుట్టిన రోజు పురస్కరించుకొని అనుష్కతో మూడవ సినిమా ను తీయడానికి ఒప్పందం కుదిరినట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తూవుంది. అయితే ఈ మూవీ మహేష్ బాబు .పీ  ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు . నవీన్ పోలిశెట్టి ఈ మూవీలో హీరో గా నటిస్తున్నారు.  తక్కువ వయసున్న అబ్బాయి తో ఎక్కువ వయసున్న అమ్మాయి మధ్య ప్రేమ పుడితే ఎలావుండబోతుందనే  కథాంశం తో ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారు








మరింత సమాచారం తెలుసుకోండి: