ఊహించని ట్విస్టులు.. అదిరిపోయే టాస్కులు.. ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ తో ప్రస్తుతం బిగ్బాస్ ఐదవ సీజన్ ఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది.. అయితే గత సీజన్ల తో పోల్చి చూస్తే ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో కాస్త ఎంటర్టైన్మెంట్ తగ్గినప్పటికీ.. బిగ్ బాస్ టాస్క్ ఇచ్చిన సమయంలో మాత్రం కంటెస్టెంట్స్ చేసే రచ్చతో అంతకు మించి అనే రేంజ్ లోనే ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సోమవారం నామినేషన్స్.. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఇచ్చే టాస్క్.. ఇక వారాంతంలో ఎలిమినేషన్  కామన్ అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇప్పటి వరకు బిగ్బాస్ తొమ్మిది వారాలు పూర్తి కాగా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటికి వెళ్లారు. ఇక 9వ వారం లో ఎవ్వరి ఊహకందని విధంగా విశ్వ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటికి వచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ కెప్టెన్ గా, బెస్ట్ రేషన్ మేనేజర్గా, బిగ్ బాస్ హౌస్ హీరోగా, అందరికంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న విశ్వ ఉన్నపళంగా ఇలా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవ్వడాన్ని మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోయారు అనే చెప్పాలి. అయితే ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ బయటికి వెళ్ళిన సమయంలో ఇక నాగార్జున టాప్ లో ఎవరు ఉండబోతున్నారు అని అడుగుతూ ఉంటాడు.

 ఈ క్రమంలోనే విశ్వ ను కూడా ఇదే విషయం అడగగా.. ఇక టాప్ ఫైవ్ లో తాను ఉండాలనుకునే కంటెస్టెంట్స్ పేరును చెప్పుకొచ్చాడు. సిరి టాప్ ఫైవ్ లో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపాడు. సన్నీ ఇలా కూల్ గా ఉంటే బాగోలేదని నువ్వు నీలాగే ఉండు అంటూ అతనికి టాప్ 4 ర్యాంక్ ఇచ్చాడు విశ్వ. ఇక షణ్ముఖ్ జస్వంత్ కి మూడవ ర్యాంక్ ఇచ్చాడు. అదే సమయంలో రవి ని అందరు గుంటనక్క అంటుంటారు  కానీ అతను అలాంటివాడు కాదు అంటూ రవి టాప్ 2 రావాలని కోరుకుంటున్నా అంటూ చెప్పాడు.  ఆ తర్వాత శ్రీరామ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.  తనకు దూరమైన తన తమ్ముడు లాంటివాడు శ్రీరామ్  అంటూ చెప్పి ఇక ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా శ్రీరామ్ నిలవాలని కోరుకుంటున్నాను అంటూ మొదటి ర్యాంకు ఇచ్చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: