ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన చిత్రం "మనం". మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకి మాత్రమే కాదు అక్కినేని ఫ్యామిలీకి కూడా చాలా చాల్ స్పెషల్. ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు స్టార్ హీరోలు ఈ చిత్రంలో కనిపించడం విశేషం. అదే మూడు తారలు అదీ కూడా ఓకే కుటుంబం నుండి...ఇలా ఈ మూవీ అక్కినేని ఫ్యామిలీకి అలాగే వారి అభిమానులకు ఒక మధురమైన జ్ఞాపకం. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా రక్త సంబంధాల బంధం జన్మజన్మలు అని చాటి చెప్పింది. పునర్జన్మలు వాటికి సంబంధించినటువంటి ఫ్లాష్ బ్యాక్ లు అన్నిటినీ కూడా సెంటిమెంటల్ గా బాగా రక్తి కట్టించారు.

తల్లి తండ్రులను కలపడానికి ఆ తనయుడు ( నాగర్జున) చేసే పనులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. నాగేశ్వరరావు గారి నటన అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించింది. తల్లి తండ్రులను ఎదురుగా చూసి కూడా...తానే కొడుకు అని చెప్పలేక కళ్లతోనే ఆ బాధను, అలాగే వారిపై ఉన్న ప్రేమను కనబరిచిన ఆయన నటనకు అందరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సినిమా మొత్తం కూడా ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో  అలాగే హాస్యాస్పద సన్నివేశాలతో నిండి అన్ని రకాల ప్రేక్షకుల మెప్పును పొందింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా ఒక ఫుల్ మీల్స్ లా కడుపు నింపేసింది.

ఇది అక్కినేని నాగేశ్వరావు నటించిన చివరి చిత్రం. అక్కినేని ఫ్యామిలీకి సంబందించిన నలుగురు హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఈ సినిమా మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఒకేసారి 2,3 తరాలను వారి ఫ్లాష్ బ్యాక్ లను చూపించినా కూడా ఎక్కడా కన్ఫ్యూషన్ లేకుండా  బోర్ కొట్టకుండా మూడు గంటలసేపు ఫుల్ గా ఎంటర్టైన్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది మనం సినిమా.  అదే విధంగా పాటలు కూడా ఈ కథకి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యి...హైలెట్ గా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: