బిగ్ బాస్.. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కార్యక్రమం అంతకంతకు రసవత్తరం గా మారిపోతుంది. మొన్నటివరకు స్నేహితులుగా ఉన్న వారే ఇకపోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు.. అయితే అటు బిగ్ బాస్ టాస్క్ లో అయితే కంటెస్టెంట్స్ అందరూ రచ్చరచ్చ చేస్తున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల తొమ్మిదో వారంలో బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న విశ్వ హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటికి వచ్చాడు.  అయితే విశ్వ ఎలిమినేట్ కావడం మాత్రం అందరినీ షాక్ కి గురి చేసింది అని చెప్పాలి. ప్రేక్షకులతో పాటు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా షాక్ అయ్యారు.



 అయితే ఇక నిన్న బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేట్ ప్రక్రియ పూర్తి కావడంతో నేడు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇక నామినేషన్స్ అంటే హౌస్ మొత్తం ఎంత వాడీవేడిగా మారిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న పది మంది మధ్య ఈ నామినేషన్ జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే తాను నామినేట్ చేయాలనుకుంటున్న నలుగురు సభ్యులను కూడా జైలుకు పంపించింది అని.. ఇక అనంతరం బజార్ మోగిన వెంటనే లివింగ్ రూమ్ లో ఉన్న తాళం ఎవరైతే దక్కించుకుంటారో వాళ్ళు తమకు ఇష్టమైన కంటెస్టెంట్ నీ జైలు నుంచి విడుదల చేసేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలోనే మొదటి తాళం దక్కించుకున్న ప్రియాంక తన హీరో మానస్ ను  జైలు నుంచి బయటకు తీసుకు వచ్చింది..


 సాధారణంగానే ప్రియాంక మానస్ మీద అమితమైన ప్రేమ చూపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. దీంతో తనకు తాళం దొరకగానే మరో ఆలోచన లేకుండా  జైలులో ఉన్నా తన హీరో మానస్ ను బయటకు తీసుకు రావడానికే తాళం ఉపయోగించింది ప్రియాంక.. ఇలా బయటికి వచ్చిన మానస్ రవి జెస్సి లను నామినేటెడ్ చేస్తున్నట్లు చెప్పాడు. బజర్ మొగగానే సిరి తాళం దక్కించుకుంది. దీంతో జెస్సిని బయటకు తీసుకు వచ్చింది. ఇక ఆ తర్వాత చివర్లో తాళం దక్కించుకున్న జెసి షణ్ముఖుని బయటకు తీసుకు వచ్చాడు. ఇక ఆ తర్వాత గత వారం కెప్టెన్గా ఉన్నప్పుడు తనకు ప్రియాంక వల్ల ఇబ్బందులు వచ్చాయని అందుకే ప్రియాంక ను నామినేట్ చేస్తున్నాను అంటూ చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: