బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ షోలో ప్రతి వారం నామినేషన్ ప్రక్రియ అనేది ఎంతో రసవత్తరంగా ఉంటుంది. ఇప్పటికే తొమ్మిది వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది తెలుగు బిగ్ బాస్ ఐదో సీజన్. ఇక హౌస్ లో పదో వారం నామినేషన్స్ కూడా హీటెక్కిస్తున్నాయనే చెప్పాలి. తాజాగా విడుదల చేసిన ప్రోమోని ఆడియన్స్ చూసిన దగ్గర్నుంచి ఎవరెవరు నామినేట్ అయ్యారు? అసలు ఈ నామినేషన్ ప్రక్రియ ఏంటి? అనేది చాలా మందికి అర్థం కాలేదు. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో చూస్తుంటే ఆనీ మాస్టర్ కి స్పెషల్ పవర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అని మాస్టర్ నుంచి ఈ నామినేషన్ ప్రక్రియ మొదలైంది.

ముందుగా నలుగురు సభ్యులు జైల్లో ఉంటారు. వీరిలో ఒక సభ్యుని రిలీజ్ చేసి మరో సభ్యుడ్ని జైలుకు పంపాలి. ఇక రిలీజ్ చేసేందుకు ఇంటి సభ్యులకు తాళం చెవిని బిగ్ బాస్ బజర్ ద్వారా అందిస్తాడు. ఈ క్రమంలోనే బజర్ రాగానే ఎవరైతే ఈ తాళం చెవిని ముందుగా దక్కించుకుంటారో వారు జైల్లో ఉన్న ఒకరిని విడుదల చేయొచ్చు. అలాగే వారు నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు ఇంటి సభ్యులను డిస్కస్ చేసుకొని వాళ్లలో ఒకరిని తిరిగి మళ్లీ జైల్లోకి పంపాల్సి ఉంటుంది. అలా ఎవరైతే జైల్లో చివరికి ఉండిపోతారో వారు ఈ వారం నామినేషన్ లోకి వస్తారు. ఇక మిగిలిన ఇంటి సభ్యులు సేఫ్ జోన్లో ఉంటారు. అయితే సరిగ్గా ఇక్కడే బిగ్ బాస్ సూపర్ ట్విస్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

అదేంటంటే కెప్టెన్ గా ఆనీ మాస్టర్ కి ఒకరిని సేవ్ చేసే అవకాశం ఇచ్చినట్లు చెబుతున్నారు. దీనివల్ల యాంకర్ రవి ఈ వారం కూడా నామినేట్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ విధంగా ఈ వారానికి గాను మొత్తం 5 గురు ఇంటి సభ్యులు నామినేషన్స్ లో ఉన్నట్లుగా సమాచారం. వీరిలో వి జె సన్నీ, యాంకర్ రవి, కాజల్ మానస్, సిరి ఉన్నారు. ఇక మానస్,సన్నీ, కాజల్ ఈ ముగ్గురు కూడా ఒకే గ్రూపుగా ఉన్నారు. వీరిలో ఓటింగ్ ఆధారంగా లాస్ట్ వీక్ చూసుకున్నట్లయితే కాజల్ డేంజర్ జోన్ లో ఉంది. మరి ఈ వారంలో నామినేట్ అయిన ఈ ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని తెలియాలంటే వీకెండ్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: