డా అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియా వార్తలు. ఇంతకీ జెస్సీ ఎందుకు ఎలిమినేట్ అవుతున్నాడు? అనే పూర్తి వివరాల్లోకి వెళితే.. బిగ్ బాస్ 10వ వారం నామినేషన్స్ లో భాగంగా జైల్లో కి వెళ్ళిన జెస్సీని, సిరి సేవ్ చేసింది. అయితే హౌస్ లో చాలా సేపు ఓకే ప్లేస్ లో నిలుచుని ఉన్న జెస్సీ ఒక్కసారిగా కళ్లు తిరిగి కింద పడిపోయాడట. దీంతో జెస్సీని ఎమర్జెన్సీ రూమ్ లో ఉంచి చికిత్స చేస్తున్నట్లుగా సమాచారం. గత వారం రోజుల నుంచి జెస్సీ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తను సంచాలక్ గా ఉన్న సమయం నుండి ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడు జెస్సి.

అయితే హెల్త్ గురించి లాస్ట్ వీక్ నాగార్జున అడిగినా కూడా ఇప్పుడు సెట్ అయింది అని చెప్పాడు. కానీ టాస్క్ లో మాత్రం 100% ఫిట్నెస్ తో పాటిస్పేట్ చేయలేకపోయాడు. అయితే ఇప్పుడు కళ్లు తిరిగి పడిపోవడం తో డాక్టర్ ని పిలిపించి ఎమర్జెన్సీ రూమ్ లో అతనికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంతే కాదు అవసరమైతే హాస్పటల్ కు సైతం తీసుకుని వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక గత సీజన్లో చూసుకున్నట్లయితే గంగవ్వ కి ఇలాగే హెల్త్ ప్రాబ్లం అయితే ఆమెను ఎలిమినేట్ చేశారు. అలాగే అదే సీజన్లో నోయల్ కూడా కాలు నొప్పి తో హౌస్ నుండి బయటకు వచ్చేసాడు.

 అందుకే ఇప్పుడు ఈ సీజన్లో జెస్సీ ఆరోగ్య సమస్యలతో ఇంటి నుండి వెళ్లిపోతున్నాడు అనే అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. ఒకవేళ కనుక జెస్సీ ఈ వారం హౌస్ నుండి బయటకు వెళ్ళిపోతే ఈవారం ఎలిమినేషన్ ఉండదని చెప్పవచ్చు. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం 10 వ వారం నామినేషన్స్ లో భాగంగా మొత్తం ఐదుగురు సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో రవి, సిరి, మానస్, సన్నీ లతో పాటు కాజల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈవారం ఎలిమినేషన్ లేకపోతే అందరూ సేఫ్ అయినట్లే. మరి హెల్త్ ప్రాబ్లం వల్ల జెస్సీ నిజంగానే హౌస్ నుండి బయటకు వెళ్లి పోతున్నాడా? అనేది తెలియాలంటే ఈ వీకెండ్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: