తెలుగు బుల్లితెర పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్ బాస్ ఐదో సీజ‌న్ దూసుకు పోతోంది. ఇప్ప‌టికే ఈ సారి సీజ‌న్ లో ఉన్న కంటెస్టెంట్ల‌కు కూడా సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉండ‌డంతో ఈ షో కేవ‌లం బుల్లి తెర మీద‌నే కాకుండా... అటు సోష‌ల్ మీడియాలోనూ దూసుకు పోతోంది. బిగ్ బాస్ షోకు ఎలాంటి క్రేజ్ ఉన్నా కూడా ఈ సారి షోలో ట్విస్టులు లేక‌పోవ‌డం.. గేమ్స్ కూడా మ‌రీ అంత‌లా ఆక‌ట్టు కునేలా లేక‌పోవ‌డం మాత్రం కాస్త నిరాశ క‌లిగించే అంశ‌మే.. అయినా కూడా షో దూసు కు పోతోంది.

విచిత్రం ఏంటంటే ఈ సారి బిగ్ బాస్ షో చాలా లేట్ నైట్ లో ప్ర‌సారం చేస్తున్నారు. అయినా కూడా ఇంత టీఆర్పీ వ‌స్తుండ‌డంతో అంద‌రూ షాక్ అవుతున్నారు. ఇక ఇప్ప‌టికే బిగ్ బాస్ షో స‌గం సీజ‌న్ పూర్తి చేసుకుంది. వ‌చ్చే నెల 20వ తేదీ నాటికి ఈ షో కంప్లీట్ అవుతుంది. అప్పుడు అస‌లు ఈ సీజ‌న్ బిగ్ బాస్ విన్న‌ర్ ఎవ‌రో తేలిపోతుంది. అయితే అస‌లు విజేత ఎలా ?  ఉన్నా కూడా ఇప్పుడు టాప్ - 5లో ఎవ‌రెవ‌రు ఉంటారో ? అన్న‌ది సోష‌ల్ మీడియాతో పాటు షో వీక్ష‌కుల్లో పెద్ద ఆస‌క్తి గా మారింది.

ఇప్పుడు న‌డుస్తోన్న చ‌ర్చ ల‌తో పాటు అంచ‌నాల‌ను బ‌ట్టి చూస్తే ఆనీ మాస్ట‌ర్ , ప్రియాంక -  జ‌శ్వంత్ మిన‌హా మిగిలిన కంటెస్టెంట్లు అంద‌రూ కూడా స్ట్రాంగ్ గానే ఉన్నార‌ని చెపుతున్నారు. ఈ ముగ్గురూ కూడా ఎలిమినేట్ అయిపోవ‌చ్చ‌నే అంటున్నారు. ఇక అప్పుడు హౌస్ లో కేవ‌లం ఏడుగురు మాత్ర‌మే మిగులు తారు. ఇక సింగర్ శ్రీరామ్ - సన్నీ - షణ్ముఖ్ సిరి తో పాటు మానస్ టాప్ - 5లో ఉంటార‌ని అంటున్నారు. ఇక వీరి తో పాటు ర‌వి , కాజ‌ల్ కూడా వీరికి గ‌ట్టి పోటీ ఇస్తార‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: