మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ ను చకచకా పూర్తి చేస్తున్నాడు, ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ ను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇలా ఈ రెండు సినిమాల షూటింగ్ లను శరవేగంగా పూర్తి చేస్తున్న చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను ఈ సినిమా దర్శకుడు మెహర్ రమేష్ తెలియజేశాడు.

 భోళా శంకర్ లుక్ టెస్ట్ ను మరియు ఫోటో షూట్ ను స్టార్ట్ చేశామని, ఈ నెల 11 వ తేదీన ఉదయం 7.45 నిమిషాలకు పూజా కార్యక్రమాలు ప్రారంభించబోతున్నము అని ఆ తర్వాత ఈ నెల 15 వ తేదీ నుండి షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లుగా ప్రకటించాడు డైరెక్టర్ మెహర్ రమేష్. ఇక తాజా గా విడుదలైన ఫోటోలలో మెగాస్టార్ చిరంజీవి డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి, కీర్తి సురేష్ లకు సంబంధించిన ఒక వీడియోను చిత్ర బృందం విడుదల చేయగా, దీనికి జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలతో పాటు బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో కూడా ఒక సినిమాలో నటించబోతున్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ మాస్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: