టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -టాలీవుడ్ హాంక్ రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా సినిమా ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే  ఇంకా అలాగే డైలాగ్స్ అందిస్తున్నారు.ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాకి ఆఫీషియల్ రీమేక్. ఇక ఈ సినిమా రన్ టైం వచ్చేసి దాదాపు మూడు గంటలు (175 నిమిషాలు) ఉంటుంది.అందుకే ఇప్పుడు తెలుగు వెర్షన్ లో రన్ టైం విషయంలో మూవీ మేకర్స్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం తెలుస్తోంది.ఇక మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మలయాళ స్క్రిప్ట్ లో మన తెలుగు సినిమా నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగిందట. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని పూర్తిగా దృష్టిలో పెట్టుకొని కొన్ని ఎపిసోడ్స్ ని పెట్టడం జరిగిందట. ఇక అలానే సినిమా లెంత్ కూడా దాదాపు రెండున్నర గంటలు వచ్చేలా స్క్రిప్ట్ రెడీ చేయడం జరిగిందట.

ఇక ఈ సినిమా రన్ టైం ని తగ్గించడం వల్ల ఈ సినిమా స్క్రీన్ ప్లే మరింత గ్రిప్పింగ్ గా ఉండే అవకాశం చాలా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా అభిమానుల నుంచి మంచి విశేష స్పందన తెచ్చుకుంది. కాకపోతే ఈ సినిమాలో రానా కంటే కూడా పవన్ కళ్యాణ్ పాత్రకు చాలా ఎక్కువ ప్రాధాన్యతని కల్పించారనే సందేహాలు కలుగుతున్నాయి.మలయాళం సినిమాలో బిజు మీనన్ కి పృథ్వీ రాజ్ కి సమానంగా ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ తెలుగు సినిమాలో మాత్రం పవన్ నే బాగా హైలైట్ చేసినట్లుగా తెలుస్తుంది.అందుకే ఇప్పటి వరకు విడుదలైన మూడు పాటలు కూడా పవన్ కళ్యాణ్ ని హైలైట్ చేస్తూ ఆయన మీద చిత్రీకరించినవే. ఇక రానా కు సంబంధించి కేవలం ఒక టీజర్ మాత్రమే వదిలడం జరిగింది.అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టీజర్ స్థాయిలో లేదనే చెప్పాలి. అందుకే ఈ సినిమాని అసలు మల్టీస్టారర్ గా కాకుండా కేవలం సింగిల్ స్టార్ సినిమాగా తీస్తున్నారనే కామెంట్స్ సోషల్ మీడియాలో బలంగా వస్తున్నాయి.ఇక దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: