ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమాలు చేస్తూనే మరో పక్క అనేక బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ అనేక యాడ్లలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు ఆయన చేసిన ఒక యాడ్ ఆయనని చిక్కుల్లో పడేలా చేసిందట.ఆయన వివాదంలో చిక్కుకోవడమే కాకుండా నోటీసులు కూడా అందుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలుస్తుంది.అయితే అసలు ఏం జరిగింది అంటే 
 
చివరిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో అల వైకుంఠ పురం లో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతానికి సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయని తెలుస్తుంది. తన కెరీర్ లో మొట్టమొదటి సారిగా ఒక డి గ్లామర్ రోల్ లో నటించడమే కాక పూర్తిస్థాయిలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో అల్లు అర్జున్సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడని తెలుస్తుంది.
 

ముందు ఒకే భాగంగా విడుదల చేయాలని అనుకున్నారు కానీ నిడివి పెరిగి పోవడంతో రెండు భాగాలుగా విడుదల చేయాలని భావించారని తెలుస్తుంది.అందులో భాగంగానే మొదటి భాగం డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సర్వం సిద్ధం చేస్తున్నారట నిర్మాతలు.. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ, సునీల్ మరియు ధనుంజయ, వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటిస్తున్నారట అయితే ఈ సినిమా సంగతి పక్కన పెడితే అల్లు అర్జున్ తాజాగా చిక్కుల్లో చిక్కుకున్నాడని తెలుస్తుంది.

తెలంగాణ ఆర్టీసీ ప్రతిష్టను కించపరచినందుకు గాను అల్లు అర్జున్ సహా రాపిడో అనే ఒక బైక్ షేరింగ్ సంస్థ కు లీగల్ నోటీసు ఇచ్చారట ఆర్టీసీ ఎండీ సజ్జనార్. అల్లు అర్జున్ నటించిన తాజా రాపిడో యాడ్లో ఆర్టీసీ బస్సులను కించపరిచే విధంగా కొన్ని డైలాగులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారని తెలుస్తుంది.ఆర్టీసీ బస్సులో ఎక్కితే సాధారణ దోశల మాదిరి గానే ఎక్కువ సమయం తీసుకుంటాయి అని కానీ రాపిడో చాలా వేగంగా సురక్షితంగా ఉంటుందని అదే సమయంలో మసాలా దోశ సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ చెప్పడం సరికాదని పేర్కొన్నారని తెలుస్తుంది.

ఈ యాడ్ తో ఆర్టీసీ ప్రయాణికులు మరియు అభిమానులు, సంస్థ ఉద్యోగులు అలాగే రిటైర్డు ఉద్యోగులు సహా అనేకమంది నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అని పేర్కొన్న ఆర్టీసీ ఎండి సజ్జనార్ రాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను నెగిటివ్గా చూపించడాన్ని ఖండిస్తున్నామని అన్నట్లు సమాచారం. వాస్తవానికి మెరుగైన, పరిశుభ్రమైన పర్యావరణ సమాజం కోసం ప్రజా రవాణా ప్రోత్సహించే ప్రకటనలు యాక్టర్స్ నటించాలి అన్నారని తెలుస్తుంది.

అంతే కానీ ఇలా వ్యతిరేకంగా ఉన్న వాటిలో నటించకూడదని సజ్జనార్ అన్నారని సమాచారం.ఆర్టీసీ అంటేనే సామాన్యులకు సేవ చేసే సంస్థ గా ఉందని అలాంటి సంస్థ కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని కాబట్టి అందులో నటించిన అల్లు అర్జున్ సహా ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థ సైతం లీగల్ నోటీసులు పంపామని సజ్జనార్ అన్నారని తెలుస్తుంది.మరి దీని మీద అల్లు అర్జున్ ని ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: