మంచిరేవుల ఫామ్ హౌస్ లో  పేకాట దందా కేసులో నిందితుడిగా అరెస్ట్ అయిన టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు అతనికి షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేస్తూ ఉప్పర్ పల్లి కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఇక  మంచిరేవుల ఫామ్ హౌస్ లో పేకాట కేసులో శివలింగప్రసాద్ ను  బుధవారం నాడు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన రాత్రి మంచిరేవులలోని హీరో నాగశౌర్య ఫామ్ హౌస్ లో పేకాటని ఆడుతున్నవిషయమై సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు చేయడం జరిగింది.  ఇందులో ఇక ప్రధాన నిందితుడు సుమన్ సహా 30 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఇక సుమన్ తో కలిసి శివలింగప్రసాద్ ఈ ఫామ్ హౌస్ లో పేకాట నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించడం జరిగింది. దీనితో ఈ రోజు నాగ సౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ ని పోలీసులు అరెస్ట్ చేసి ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపర్చడం జరిగింది.

పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కోసం సుమన్ ఈ ఫామ్హౌస్ ను అద్దెకు తీసుకొన్నాడు.ఈ ఫామ్ హౌస్ లో పేకాట  ఆడుతున్నారని కచ్చితమైన సమాచారం తెలుసుకొని  పోలీసులు ఈ ఫామ్ హౌస్ పై దాడి చేయడం జరిగింది. పేకాట ఆడుతూ ఉండగా మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య సహా పలువురు  పోలీసులకు దొరికారు. గుత్తా సుమన్ కుమార్ ఈ పేకాట నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులు వీఐపీలు రాజకీయ నేతలతో  గుత్తా సుమన్ కుమార్  కు సంబంధాలున్నాయని  దర్యాప్తులో పోలీసులు గుర్తించడం జరిగింది.ఇక  ఆ రోజు మొత్తం 30 మంది వరకు పేకాటరాయుళ్లు పట్టుబడటం జరిగింది. ఇక వీళ్లలో మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్యతో పాటు నిజామాబాద్ విజయవాడ వంటి ప్రాంతాల నుంచి వచ్చిన బడా బాబులు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: