మిల్కీ బ్యూటీ తమన్నా ఫస్ట్ టైమ్ హోస్ట్ గా చేసిన మాస్టర్ చెఫ్ కార్యక్రమం మంచి అంచనాల నడుమ మొదలు అయ్యిందని తెలుస్తుంది . జెమిని టీవీలో టెలికాస్ట్ అయిన మాస్టర్ చెఫ్ ను జనాలు పెద్దగా పట్టించుకోలేదని సమాచారం.

తమన్నా హోస్ట్ అవ్వడం వల్ల ఒకటి రెండు వారాలు చూసినా ఆ తర్వాత నుండి లైట్ తీసుకున్నారని తెలుస్తుంది. దాంతో మాస్టర్ చెఫ్ నిర్వాహకులకు మరియు జెమిని టీవీకి భారీ నష్టం తప్పలేదని తెలుస్తుంది.మాస్టర్ చెఫ్ కు ఎంతగా పబ్లిసిటీ చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందట.షోను ఎంత వివాదంగా మల్చాలని ప్రయత్నించినా కూడా జనాలు పట్టించుకోలేదట.దాంతో చేసేది లేక తమన్నాను తప్పించి అనసూయను హోస్ట్ గా తీసుకు వచ్చారని తెలుస్తుంది.. షో మద్యలో తమన్నాను తొలగించడం ఖచ్చితంగా ఆమెను అవమానించడం అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారట . అదే సమయంలో తమన్నా ఈ విషయమై లీగల్ గా ఎదుర్కొనేందుకు సిద్దం అయ్యిందని తెలుస్తుంది.

తమన్నాతో ఏదో విధంగా రాజీ కుదుర్చుకునేందుకు జెమిని టీవీ అండ్ టీమ్ ప్రయత్నాలు చేస్తున్నారట . ఆ విషయం పక్కన పెడితే తమన్నాను తొలగించి అనసూయను తీసుకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మంచి రేటింగ్ వస్తుందని అంతా ఆశించారని కాని అదేమీ జరగడం లేదట తమన్నా ఉనప్పుడు ఎలా రేంటింగ్ ఉందో ఇప్పుడు అనసూయ హోస్ట్ గా కూడా అదే రెస్పాన్స్ అదే రేటింగ్ వస్తోందట జబర్దస్త్ అందాల ముద్దుగుమ్మ అనసూయ ఎన్నో అంచనాల నడుమ మాస్టర్ చెఫ్ లో అడుగు పెట్టిందని ఆమె సందడిగా వంటల కార్యక్రమంను నిర్వహిస్తుందని అయినా కూడా జనాలు పట్టించుకోవడం లేదుట దీంతో తెలిసింది ఏంటీ అంటే హోస్ట్ ల సమస్య కాదు ప్రేక్షకులకు అసలు ఈ కాన్సెప్ట్ పెద్దగా ఎక్కలేదని తెలుస్తుంది.

అనసూయ ఒక వైపు బుల్లి తెరపై వరుసగా షో లతో బిజీగా ఉన్నా కూడా వెండి తెరపై కూడా ఈ అమ్మడి దూకుడు కొనసాగుతోందని తెలుస్తుంది.రంగమ్మత్త వంటి మంచి పాత్ర తర్వాత వరుసగా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయని మరో రంగమ్మత్త స్థాయి పాత్రను పుష్ప సినిమాలో అనసూయకు సుకుమార్ ఇచ్చాడని తెలుస్తుంది . సుకుమార్ మరియు అల్లు అర్జున్ ల పుష్ప సినిమా లో అనసూయ పాత్ర చాలా ప్రత్యేకంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందట అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారని సమాచారం.. అంతే కాకుండా అనసూయ ప్రథాన పాత్రలో రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా పట్టాలెక్కేందుకు సిద్దంగా ఉన్నాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: