తెలుగు బుల్లితెర పై ఎంతో మంది యాంకర్లు  వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాలకు బాగా దగ్గరవుతూ  ఉంటారు.  ఇలాంటి యాంకర్లలో ఉదయభాను కూడా ఒకరు అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఎక్కడ బుల్లి తెరపై కనిపించడం లేదు కానీ.. ఒకప్పుడు మాత్రం ఎక్కడ చూసినా కనిపించి ప్రతీ కార్యక్రమంలో తనదైన శైలిలో లో అదరగొట్టింది. అన్ని రకాల కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. బుల్లితెరపై యాంకర్గా వెండితెర నటిగా కూడా ఎంతగానో అలరించింది ఉదయభాను. అయితే బుల్లి తెర పై ఉదయభాను కెరీర్ మొదలు కావడం నుంచి స్టార్ యాంకర్ గా ఎదగడం వరకు జర్నీ మొత్తం ఎంతో ఆసక్తికరంగా సాగింది అనే చెప్పాలి.


 అందానికి,, చలాకీతనం కి కేరాఫ్ అడ్రస్గా బుల్లితెరపై యాంకర్గా పరిచయమైంది ఉదయభాను. అందరిలో కలిసిపోయి ఫ్రెండ్లీ నేచర్ తో తన ఆకర్షణీయమైన మాట తీరుతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్లో జన్మించింది ఉదయభాను. పదవ తరగతి చదువుతున్న సమయంలోనే మొదటిసారి కెమేరా ముందుకు వచ్చింది ఉదయభాను. ఈటీవీ లో ప్రసారమయ్యే హృదయాంజలి అనే కార్యక్రమం ద్వారా జనాల్లోకి వెళ్లి ఎంతో మంది మహిళలను సరదాగా మాట్లాడించడం అనే కాన్సెప్టుతో షో నిర్వహించింది. ఆ సమయంలో అసలు యాంకరింగ్ అంటే ఏంటో కూడా తెలీదు ఉదయభానుకి.


 అయినప్పటికీ ఆ వయసులోనే    గలగలా మాట్లాడుతూ తన వాక్చాతుర్యంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షించింది. అయితే తండ్రి లేకపోవడంతో ఎన్నో ఆటుపోట్లను కూడా చూసింది ఉదయ భాను . మొదటి ప్రోగ్రాంతో యాంకర్ గా సక్సెస్ అయినా ఉదయభాను ఆ తర్వాత.. జెమినీ టీవీ లో ఎన్నో కార్యక్రమాలు కూడా చేసింది. వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింభకా అనే కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరయింది. అంతేకాకుండా రేలారే రేలా అనే ఒక జానపద కార్యక్రమంలో కూడా యాంకర్ గా అదరగొట్టి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం డాన్స్ రియాలిటీ షో గా కొనసాగుతున్న ఢీ కార్యక్రమంలో ఒకప్పుడు ఉదయభాను యాంకరింగ్ తో అదర గొట్టింది అనే చెప్పాలి. తర్వాత ఎన్నో సినిమాల్లో నటిగా కూడా అవకాశం దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మకు. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో బుల్లితెరపై వెండితెర పై కూడా కనుమరుగయ్యింది.  కానీ ఇప్పుడు అప్పుడప్పుడు బుల్లితెరపై మెరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: