తెలుగు సినిమా పరిశ్రమలో కొందరు యాంకర్ లు బాగా హడావుడి చేస్తూ ఉంటారు అనే మాట వాస్తవం. అందులో ప్రధానంగా యాంకర్ అనసూయ పేరు మన ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూనే ఉన్నాం. ఆమెకు వరుసగా సినిమాలు రావడం అలాగే కొంతమంది అగ్ర దర్శకులు కూడా ఆమెను సంపాదించడంతో ఆమె కాస్త హడావుడి చేస్తుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అనసూయ కొన్ని పెద్ద సినిమాలో నటిస్తుండగా త్వరలోనే మరికొన్ని సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది అని ప్రచారం కూడా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది.

ఇక పెద్ద పెద్ద దర్శకుల విషయంలో అనసూయ చాలా జాగ్రత్తగా ఉండడమే కాకుండా ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళుతోంది. ప్రస్తుతం అనసూయ రెండు మూడు సినిమాల్లో మినహా పెద్దగా నటించే ప్రయత్నం కూడా చేయడం లేదనే ప్రచారం కూడా ఉంది. ఇక అనసూయ తర్వాత సినిమా ఏం చేస్తుంది ఏంటనే దానిపై క్లారిటీ లేకపోయినా తర్వాత సినిమా విషయంలో మాత్రం ఆమె భారీ ప్లాన్ చేసుకుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అయితే ఆమె తర్వాతి సినిమా రాజమౌళి తో చేస్తుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమాల్లో ఆమె మహేష్ బాబుకి అక్క పాత్రలో నటిస్తుందని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే ఆమెకు కథ కూడా వ్యవహరించారని ఆమె కూడా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారని త్వరలోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇచ్చే అవకాశాలున్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ప్రస్తుతం ఆమె సినిమాకు సంబంధించి ఎటువంటి స్పష్టత లేకపోయినా అనసూయ మాత్రం ఆ సినిమా కోసం రెడీ అవుతుందని అందుకోసం కొన్ని కార్యక్రమాలకు కూడా ఆమె దూరంగా ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: