బుల్లితెరపై కామెడీ షోలో 'జబర్దస్త్' చేసి ప్రేక్షకుల మనసు దోచుకున్న అనసూయ వెండి తెరపైన కూడా వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. అయితే తనను ఎవరన్నా అంటే మాత్రం అదే స్పీడ్ తో అంతే 'జబర్దస్త్'గా ఇచ్చి పడేస్తది అనసూయ. ఇటీవల జరిగిన పరిణామాలే అందుకు ఉదాహరణ. రీసెంట్ గా సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రోజుల్లో టాలీవుడ్‌లో వస్తున్న కామెడీ గురించి మాట్లాడారు. జబర్దస్త్ వంటి కామెడీ షోల గురించి యాంకర్ ఆయన అభిప్రాయాన్ని అడిగినప్పుడు, కోట శ్రీనివాసరావు అలాంటి షోలలో ఏం ఉంది? అని అడిగారు. షోకి హోస్ట్‌లలో ఒకరైన అనసూయ గురించి కూడా వ్యాఖ్యలు చేశారు.

“అందులో ఏముంది? అనసూయ గారు ఉన్నారు, ఆమె మంచి నటి, మంచి డ్యాన్సర్, మంచి వ్యక్తిత్వం, మంచి వ్యక్తీకరణ ఉన్న మహిళ. అయితే ఆ ప్రోగ్రాం లో ఆమెని చూడండి, ఆమె డ్రెస్సింగ్ విధానం నాకు నచ్చలేదు. ఆమె అందంగా ఉంది, ప్రేక్షకులు ఆమె వైపు చీర కట్టుకున్నా చూస్తారు. రోజా (న్యాయమూర్తి) కూడా అదే కార్యక్రమంలో ఉన్నారు. ప్రేక్షకులు ఆమెను చీరలో చూడలేదా? అంటూ కామెంట్స్ చేశారు. అయితే అనసూయ మాత్రం ఈ విషయంపై చాలా ఘాటుగా స్పందించింది. “నేను ఒక సీనియర్ నటుడు చేసిన కొన్ని కామెంట్‌లను చూశాను.. నేను డ్రెస్సింగ్ ఎంపిక చేసుకోవడం ఆయనకు ఆందోళన కలిగించే విషయం.. ఇండస్ట్రీలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి అలాంటి కామెంట్స్ చేసినందుకు బాధగా ఉంది. ఎవరు వేసుకున్న బట్టలు పూర్తిగా వారి వ్యక్తిగతమని అందరూ తెలుసుకోవాలి. వృత్తిపరమైన ఎంపిక కూడా కావచ్చు. కానీ ఇప్పటికీ అది తన ఇష్టం. నేటి సోషల్ మీడియా ఇలాంటి కంటెంట్‌ను ఎలా హైలైట్ చేస్తున్నారో  విడ్డూరం ఉంది. ఇంతకుముందు సోషల్ మీడియా ఉందా? ఈ సీనియర్ నటుడు మద్యం సేవించడం లేదా చిరిగిన బట్టలు ధరించడం లేదా తెరపై మహిళలను అసభ్యంగా ప్రవర్తించడం లేదా అవమానించడం ఎందుకు అని ప్రశ్నించారా? పెళ్లయి పిల్లలు ఉన్న మగవారు తెరపై రొమాన్స్ చేస్తూ, షర్ట్‌లెస్ ఫిజిక్‌ను ప్రదర్శించే వాళ్ళను ఎందుకు ప్రశ్నించరని నిలదీసింది అనసూయ.

ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. ఆమెకు ఎలాంటి సంఘటనలు ఎన్నో ఎదురయ్యాయి. అన్నింటికీ, అందరికీ తనదైన రీతిలో సమాధానం చెప్పి నోళ్లు మూయిస్తుంది అను. తన జోలికి ఎవరన్నా వచ్చారంటే ఏమాత్రం 'తగ్గేదే లే' అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: