అనసూయ భరద్వాజ్.. టెలివిజన్ వ్యాఖ్యాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు తెలుగు చలన చిత్రాలలో కూడా నటించి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది..తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకునే నైజం ఈమెది. అనసూయ స్టార్ హీరోయిన్ ల లాగే ఈమె కూడా ఓరియెంటెడ్ చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను ప్రేక్షకులలో ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. సాధారణంగా దర్శకులు స్టార్ హీరోయిన్లతో మాత్రమే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు తెరకెక్కించడానికి ముందుకు వస్తారు.. కానీ అనసూయ నటన చూసి ఆమెలో ఉన్న ప్రతిభను చూసి దర్శకులు సైతం లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేయడానికి క్యూ కడుతున్నారు అంటే ఆమె లో ప్రతిభ ఏంటో మనం అంచనా వేయవచ్చు.2016 సంవత్సరం లో నటించిన క్షణం, 2018 సంవత్సరంలో నటించిన రంగస్థలం సినిమాలో ఈమె నటనకు గాను రెండు SIIMA అవార్డులను, ఒక ఫిలింఫేర్ అవార్డుతో పాటు ఒక IIFA ఉత్సవం అవార్డును కూడా సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. నాగ సినిమా కోసం 2003 లో షూటింగ్ చూద్దామని వెళ్లి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. న్యూస్ ప్రెజెంటర్స్ గా తన కెరీర్ ని మొదలు పెట్టిన అనసూయ ఆ తర్వాత యాంకర్ గా , నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసింది.బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈమె..తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమాల్లో విలన్ పాత్రలు కూడా పోషిస్తోంది. పుష్ప సినిమాలో సరికొత్తగా ,విలన్ గా ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఈ సినిమా నుంచి ఈమె కు సంబంధించిన ఒక పోస్టర్ కూడా విడుదల చేయడంతో ఈ పోస్టర్ ద్వారా అనసూయ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలలో కూడా అవకాశం కొట్టేస్తోంది ఈ అమ్మడు.

మరింత సమాచారం తెలుసుకోండి: